Samantha: విడాకుల అనంతరం సమంతకి ఫుల్ సపోర్ట్ చేస్తూ పబ్లిక్ గా మాట్లాడిన హీరోయిన్ మాధవీలత ఒక్కటే. అందం అభినయం ఉన్నా.. ఎందుకో మాధవీలత ‘సి గ్రేడ్’ హీరోయిన్ గానే మిగిలిపోయింది. కనీసం రాజకీయాల్లోనైనా ఎదుగుదాం అనే ఆలోచనతో బీజేపీ తీర్థం పుచ్చుకుని ప్రస్తుతం టైమ్ పాస్ చేస్తోంది. ఎలాగూ కావాల్సినంత టైం ఉంది కాబట్టి.. సామాజిక అంశాల పై సినిమా ఇండస్ట్రీలోని లొసుగులు పై ఎప్పటికప్పుడు తనదైన అభిప్రాయాలను చెబుతూ మొత్తానికి ప్రేక్షకులకు సరైన సమాచారాన్ని అందిస్తోంది.

ఈ నేపథ్యంలోనే మాధవీలత, సమంత పై కొన్ని కామెంట్స్ చేసింది. డివోర్స్ విషయంలో సమంత ఎలాంటి తప్పు చేయ లేదని మాధవీలత మాటల సారాంశం. అందుకే ఎట్టిపరిస్థితుల్లో సమంతని తప్పు పట్టకూడదు అని చెబుతుంది ఈ ఫేడ్ అవుట్ భామ. ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ సమంత గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది.
“సమంత విడాకుల గురించి నేను ఎక్కువగా మూడు రకాల కామెంట్స్ చూశాను. అందులో మొదటిది : సినిమా వాళ్ళ కాపురాలు ఎక్కువకాలం నిలబడవు. రెండోది: సమంత వేసుకున్న డ్రెస్సుల వల్లే ఆమెకు చైతు విడాకులు ఇచ్చాడు. మూడోది: సామ్ మతం గురించి. అయితే, ఈ కామెంట్స్ లో ఎక్కడా వాస్తవం లేదు అని చెప్పుకొచ్చింది మాధవీలత.
అలాగే సమంతకి డబ్బు పిచ్చి ఉందని కొంతమంది అంటున్నారు. ఆమెకు ఎలాంటి డబ్బు పిచ్చి లేదు. చాలామందికి తెలియదు, సినిమాలు, బ్రాండ్స్ ద్వారా వచ్చే డబ్బు తప్ప, ప్రారంభోత్సవాలు, ఇతర ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్తే వచ్చే డబ్బులన్నీ సమంత ప్రత్యూష ఫౌండేషన్ కి దానంగా ఇస్తోంది. ఒక హీరోయిన్ మంచిది కాకపోతే ఇలా ఎలా చేయగలుగుతుంది ?
కచ్చితంగా చెప్పగలను సమంత చాలా మంచిది. ఆమె మంచి హృదయమున్న మనిషి’ అంటూ మాధవీలత, సమంత మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా చక్కని మెసేజ్ లు పెట్టింది. మరి మధ్యలో కాంట్రవర్సీ లేకపోతే.. తన పోస్ట్ లు ఎవరు పట్టించుకుంటారు ? అందుకే, మాధవీలత ఎప్పటిలాగే.. గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి సమంత డబ్బుని కాజేశాడు’ అంటూ ఓ ఆరోపణ చేసింది. ఇంతకీ ఎవరు ఆ హీరో ? మాధవీలత దృష్టిలో సిద్దార్థ్. కానీ డైరెక్ట్ గా పేరు చెప్పలేదు.