Madharaasi Movie Review: ఇప్పటివరకు ఎవ్వరికి రానటువంటి గొప్ప గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్బంలోనే తమ సత్తా చాటుకోవాల్సిన స్టార్ డైరెక్టర్లందరు వరుసగా సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మురుగుదాస్ శివ కార్తికేయన్ ను హీరోగా పెట్టి చేసిన మదరాసి అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సిటీలో ఉన్న చాలా మంది దగ్గర గన్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి గన్స్ ఎలా వచ్చాయి…ఫ్యూచర్ లో జరగబోయే ఒక ఇంపార్టెంట్ విషయంలో వాళ్ళు ఎలా పాల్గొనబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న హీరో దాన్ని ఎలా ఆపాలనే ప్రయత్నం చేశాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే మురుగదాస్ ఈ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఒక టెంప్లేట్ లో తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. ఇక మొదట్లో ఆయన చేసిన సినిమాలు ఓకే అనిపించినప్పటికి ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఎంచుకున్న పాయింట్ మొత్తం ఔట్ డేటెడ్ అయిపోయింది. ఇక మదరాసి సినిమా విషయంలో ఆయన కొంతవరకు పర్లేదు అనిపించారు…ఇక మొత్తానికైతే ఫస్టాఫ్ ఇచ్చినంత ఇంపాక్ట్ ను సెకండ్ హాఫ్ ఇవ్వలేకపోయింది.
ఇక ఈ సినిమాలో ఎమోషన్స్ పెద్దగా వర్కౌంటు కానేకపోయాయి. అందువల్ల ఈ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వలేక పోయింది. మురుగదాస్ ఒకప్పుడు చేసిన తుపాకీ సినిమా మాదిరిగానే ఈ సినిమా ఉండడం సినిమాకి భార్య మైనస్ అయిందనే చెప్పాలి. మరి ఇప్పటివరకు మురుగదాస్ చేసిన సినిమాలన్ని ఒక డిఫరెంట్ వే లో ముందుకు సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆయన మెసేజ్లు ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు.
మరి ఈ సినిమా ద్వారా కూడా ఒక మెసేజ్ ని చెప్పే ప్రయత్నం చేసినప్పటికి అది పర్ఫెక్ట్ గా ప్రేక్షకుడికి రీచ్ అవ్వలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో శివ కార్తికేయన్ యాక్టింగ్ బాగున్నప్పటికి దీంట్లో బలం లేకపోవడం వల్ల సినిమా ఎఫెక్టివ్ గా ముందుకు సాగలేకపోయింది. ఇక ఫస్టాఫ్ లో ఎంచుకున్న పాయింట్ ను సక్సెస్ ఫుల్ గా తీసుకొచ్చాడు. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం చేతులెత్తేశాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే శివ కార్తికేయన్ చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు… ఇక దానికి తగ్గట్టుగానే ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాకుండా ఆ పాత్రకి ఎంతైతే డెప్త్ కావాలో ఆ మేరకు అందులో నటించి మెప్పించాడు. ఇక ఏది ఏమైనా కూడా శివ కార్తికేయన్ యాక్టింగ్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక విద్యుతామన్ ఓకే అనిపించినప్పటికి ఆయన పాత్రకి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోయిందనే చెప్పాలి. దానివల్ల అతను పాత్ర కూడా కొన్ని సందర్భాల్లో తేలిపోతుంది…ఇక మిగిలిన పాత్రల్లో నటించిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు…
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అంత ఎఫెక్ట్ గా అనిపించలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కొంత వరకు ఓకే అనిపించినప్పటికి సాంగ్స్ మాత్రం మెప్పించలేకపోయాయి… విజువల్స్ పరంగా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడం లో ఒక కొత్త దనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికి అవేవీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాయి… ఎడిటింగ్ పర్లేదు అనిపించింది…ప్రొడక్షన్ వాల్యూస్ సైతం ఒకే అనిపించేలా ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
శివ కార్తికేయన్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
మ్యూజిక్
రేటింగ్
ఈ మూవీ కి మేమిచ్చే రేటింగ్ 2.25/5
