Director Krish Career: మన టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో ఒకరు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi). ‘గమ్యం’ సినిమాతో ఈయన కెరీర్ మొదలైంది. ఆ తర్వాత ‘వేదం’,’కృష్ణం వందే జగద్గురుం’,’కంచె’ ఇలా ఎన్నో అద్భుతమైన మంచి సినిమాలను మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించాడు. కానీ అవేమి కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. కెరీర్ మొత్తం మీద ఒక్కటంటే ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు. అయినప్పటికీ క్రిష్ కి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ కూడా ఉన్నారు. నేడు ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఘాటీ'(Ghaati Movie) అనే చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనుష్క(Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. క్రిష్ తన కంఫర్ట్ జోన్ ని దాటి బయటకి వచ్చి కాస్త రా & రిస్టిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసాడు.
కానీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం తో బెడిసికొట్టింది. ఈ సినిమా కోసం ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని కూడా వదిలేసి వచ్చాడు. అదేదో ఆ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి ఉండుంటే కెరీర్ లో ఒక సూపర్ హిట్ వచ్చేది కదా, సినిమాలో ఆయన తీసిన సన్నివేశాలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కెరీర్ మొత్తం మీద కమర్షియల్ గా కాస్త అటు ఇటు ఆడిన ఏకైక క్రిష్ మూవీ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. ఇది కూడా పూర్తి స్థాయి కమర్షియల్ హిట్ కాదు కానీ, ఆయన గత చిత్రాలతో పోలిస్తే కాస్త బెటర్. ఇక ఈ చిత్రం తర్వాత క్రిష్ తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’,’కొండపొలం’, లేటెస్ట్ గా ఘాటీ వంటివి ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి.
క్రిష్ అద్భుతంగా కథ రాసుకుంటాడు. కానీ స్క్రీన్ ప్లే దగ్గరే ప్రతీసారీ దొరికేస్తున్నాడు. తన సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్ ని వేరే ఎవరినైనా పెట్టుకోవాలి, లేదంటే అసలు దర్శకత్వమే మానేయాలి. ఈ రెండే ఆయన ముందు ఉన్న అవకాశాలు. లేదంటే సర్దేసుకొని వెళ్లిపోవడమే. చాలా మందికి క్రిష్ సినిమా అనగానే, అబ్బా క్రిష్ సినిమానా?, నీరసం అనే ఫీలింగ్ ఉంది. ఆయన అన్ని సినిమాల్లో కూడా స్క్రీన్ ప్లే అంతటి నిదానంగా నడుస్తుంది అన్నమాట. ఇవి మార్చుకోకుండా ఉన్నంత కాలం క్రిష్ కమర్షియల్ సక్సెస్ లను చూడడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. ఆయన తదుపరి చిత్రం పై ఇప్పుడు అసలు ఎలాంటి క్లారిటీ లేదు. చక్కగా ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని ఆయన చేసుంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది ఏమో. భవిష్యత్తులో అయినా క్రిష్ తన మేకింగ్ స్టైల్ ని మారుస్తాడా లేదో చూడాలి.