https://oktelugu.com/

Mad Square: ‘మ్యాడ్ స్క్వేర్’ సెకండ్ హాఫ్ ని బయ్యర్స్ కి చూపించడానికి ఇష్టపడని నిర్మాత నాగవంశీ..అంత భయం ఎందుకు?

మార్చి నెలలో పెద్ద హీరోల సినిమాలు లేవని ఖరారు అయిపోయింది. ఇప్పుడు ట్రేడ్ మొత్తం భారీ ఆశలు పెట్టుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం మాత్రమే. మార్చి 28వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుంది. అదే రోజున నితిన్ 'రాబిన్ హుడ్' సినిమా కూడా విడుదల అవుతుంది కానీ, మార్కెట్ లో మంచి క్రేజ్,డిమాండ్ మాత్రం 'మ్యాడ్ స్క్వేర్'(Mad Square) కి మాత్రమే ఉంది.

Written By: , Updated On : March 10, 2025 / 05:37 PM IST
Follow us on

Mad Square:  మార్చి నెలలో పెద్ద హీరోల సినిమాలు లేవని ఖరారు అయిపోయింది. ఇప్పుడు ట్రేడ్ మొత్తం భారీ ఆశలు పెట్టుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మాత్రమే. మార్చి 28వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుంది. అదే రోజున నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా కూడా విడుదల అవుతుంది కానీ, మార్కెట్ లో మంచి క్రేజ్,డిమాండ్ మాత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) కి మాత్రమే ఉంది. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, అదే విధంగా రీసెంట్ గా విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ఫస్ట్ హాఫ్ గురించి అద్భుతంగా చెప్పాడు. సాధారణంగా నేను ఎలాంటి జోక్ కి అయినా నవ్వే రకం కాదు, అలాంటి నేనే ఈ సినిమాకు క్రిందపడి దొర్లాడి మరీ నవ్వుకున్నాను.

అంత అద్భుతంగా వచ్చింది ఫస్ట్ హాఫ్ అని అన్నాడు. సెకండ్ హాఫ్ నేనింకా చూడలేదని, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుందని వీళ్లంతా అంటున్నారు . ఫస్ట్ హాఫ్ కే నేను ఆ రేంజ్ లో నవ్వుకున్నాను అంటే, ఇక సెకండ్ హాఫ్ ఏ రేంజ్ లో ఉండుంటుందో మీరే అర్థం చేసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. బయ్యర్స్ కి కూడా ఫస్ట్ హాఫ్ ని మాత్రమే చూపించాడట. సెకండ్ హాఫ్ ని ఆడుతున్నా కూడా చూపించట్లేదట. అంతే కాదు సినిమా సూపర్ హిట్ అవుతుందని డైరెక్టర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చెప్తే, ఆ రేంజ్ డైలాగ్స్ వేయడం అవసరమా?, సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక చెప్పుకోవచ్చు కదా అలాంటి డైలాగ్స్ అని డైరెక్టర్ స్టేజి మీదనే వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. అదేంటి నాగవంశీ లో ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం లేదా?, అందుకే సెకండ్ హాఫ్ ని బయ్యర్స్ కి చూపించడం లేదా అనే అనుమానం ఇప్పుడు అందరిలో కలుగుతుంది.

త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమాకి, థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే చేయబోతున్నారు మేకర్స్. మొదటి భాగం లో ఉన్నటువంటి హీరోయిన్స్, రెండవ భాగం లో ఉండరట. కానీ అమ్మాయిలు మాత్రం సినిమా మొత్తం ఉంటారట. మొదటి భాగం మొత్తం కాలేజీ నేపథ్యం లో జరిగితే, రెండవ భాగం మాత్రం పెళ్లి నేపథ్యం, ఆ తర్వాత గోవా నేపథ్యం లో సాగుతుందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. ఇవి పూర్తి అవ్వగానే ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. రెండు రోజుల్లో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు కానున్నాయి. భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.