Mad Square Collection
Mad Square Collection : యూత్ ఆడియన్స్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకొని, ఇటీవలే విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రానికి మొదటి ఆట నుండే సూపర్ పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా దంచి కొట్టేసింది ఈ సినిమా. మొదటి రోజు దాదాపుగా 19 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, రెండవ రోజు కూడా కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి బయ్యర్స్ కి కాసుల కనకవర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి రెండు రోజుల్లో 8 లక్షలకు పైగా డాలర్లు వచ్చాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం రెండు మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. విడుదలకు ముందు 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్(Break Even) మార్క్ ని దాటిందో లేదో చూద్దాం.
Also Read : ‘రాబిన్ హుడ్’ బ్రేక్ ఈవెన్ అసాధ్యం..2 రోజుల్లో వచ్చింది ఎంతంటే!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 5 కోట్ల 79 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రెండవ రోజున వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. 22 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే రెండు రోజుల్లో 16 కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని రేపటి నుండి లాభాల్లోకి రానుంది ఈ చిత్రం. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి గమనిస్తే నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, సీడెడ్ ప్రాంతం నుండి కోటి 32 లక్షలు వచ్చాయి.
అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి కోటి 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, తూర్పు గోదావరి జిల్లా నుండి 77 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 41 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 90 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 60 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 36 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 10 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, ఓవర్సీస్ నుండి 4 కోట్ల 35 లక్షలు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి కోటి 10 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా 28 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూళ్లు వస్తే, 16 కోట్ల 33 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా ఇదే స్టడీ రన్ ని కొనసాగిస్తే వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read : వచ్చేస్తున్న క్రిష్ 4 మూవీ.. ఎప్పుడంటే?