Gorantla Madhav: వైయస్సార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్( gorantla Madhav ) అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన అరెస్టు విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు చేబ్రోలు కిరణ్. ఐ టి డి పి కార్యకర్త ఆయన. దీంతో తెలుగుదేశం పార్టీ స్పందించింది. సస్పెండ్ కూడా చేసింది. కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో ప్రత్యక్షమయ్యారు గోరంట్ల మాధవ్. చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నం చేశారు. అయితే పోలీస్ విధులను అడ్డగించారన్న కారణంతో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదయింది. అరెస్ట్ కూడా జరిగింది. అయితే ఒక మాజీ ఎంపీ.. ఇలా ఒక కేసులో అరెస్ట్ అయిన నిందితుడిని తరలించడాన్ని అడ్డుకోవడం నిజంగా పోలీస్ విధులకు ఇబ్బంది పెట్టడమే. సహజంగా పోలీస్ శాఖ నుంచి వచ్చిన గోరంట్ల మాధవ్ కు ఇది తెలియదా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి పై విపరీతమైన అభిమానమా?
Also Read: జగన్ పై దారుణ కామెంట్స్ : కిరణ్ పాపం పండిందిలా..
* చేబ్రోలు కిరణ్ ను తీసుకెళ్తుండగా
చేబ్రోలు కిరణ్ ( chebrolu Kiran) చేసిన కామెంట్స్కు సభ్య సమాజం హర్షించదు. ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంది. అంతెందుకు టిడిపి ఆయనపై వేటు వేసింది. ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇది కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటువంటి పరిస్థితి ఉందా? అంటే ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పుకోలేని దుస్థితి. అయితే ఓ నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్తుంటే డాడికి ప్రయత్నించడం కూడా నేరమే. ఇప్పటికే గోరంట్ల మాధవ్ పై కూటమి ఫోకస్ పెట్టింది. ఆయనపై కేసులు నమోదుకు సిద్ధపడింది. ఇటువంటి సమయంలో ఎదురెళ్లి కేసులను తెచ్చుకున్నారంటే బలమైన కారణం ఉండే ఉంటుంది.
* దివాకర్ రెడ్డిని సవాల్ చేసి
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. అనంతపురం ఎంపీగా జెసి దివాకర్ రెడ్డి ఉండేవారు. అప్పట్లో హిందూపురం సిఐగా గోరంట్ల మాధవ్ ఉండేవారు. ఓ వివాదంలో జెసి దివాకర్ రెడ్డిని సవాల్ చేసి రాష్ట్రంలో సంచలనంగా మారారు గోరంట్ల మాధవ్. వెంటనే ఆయనతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించి రాజకీయాల్లోకి తెచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి హిందూపురం ఎంపీగా పోటీ చేయించారు. ఎంపీగా గెలిచిన మాధవ్ పాలన కంటే వివాదాల వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. 2024 ఎన్నికల్లో మాధవ్ ను పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఎక్కడ టికెట్ ఇవ్వలేదు. పోనీ ఎన్నికల అనంతరం ఏదో ఒక నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారు అంటే అది కూడా లేదు. అయితే ఇప్పుడు చేబ్రోలు కిరణ్ పై దాడి చేయడానికి సిద్ధపడటం వెనుక రాజకీయ కోణం ఉందన్నది ఒక అనుమానం.
* ప్రస్తుతం ఏ బాధ్యతలు లేక.. హిందూపురం( hindupuram) ఎంపీగా ఉన్న మాధవ్ ను తప్పించారు. అప్పటినుంచి ఆయనను పొలిటికల్ గా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో ఏదో ఒక నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని ఆయన జగన్మోహన్ రెడ్డి ని కోరుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. తన సొంత జిల్లా కర్నూలులో కానీ.. అనంతపురంలో కానీ ఏదో ఒక నియోజకవర్గాన్ని సర్దుబాటు చేయాలని కోరుతూ వచ్చారు మాధవ్. దానికోసమే ఇప్పుడు చేబ్రోలు కిరణ్ పై దాడి అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.
Also Read: విద్యార్థులకు వారంలో రెండుసార్లు ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీలో మారిన మెనూ!