Homeఎంటర్టైన్మెంట్Maa Inti Bangaram 18 Days Collection: 'మా ఇంటి బంగారం' 18 రోజుల వరల్డ్...

Maa Inti Bangaram 18 Days Collection: ‘మా ఇంటి బంగారం’ 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. పెద్ద టార్గెట్ మిస్ అయిందిగా..

Maa Inti Bangaram 18 Days Collection సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం కమర్షియల్ గా ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన అన్ని చిత్రాలకంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. లాభాల రిటర్న్స్ విషయం లో అయితే ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీ లోనే ది బెస్ట్ మూవీస్ లో ఒకటి గా చెప్పుకోవచ్చు. సినిమా విడుదలై 18 రోజులైంది. ఇప్పటికీ ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. దీనిని బట్టే చెప్పొచ్చు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిది అనేది. 18 వ రోజున కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి అట. గత వారం విడుదలైన కొత్త సినిమాలకు కూడా నిన్న ఈ రేంజ్ వసూళ్లు నమోదు అవ్వలేదు. ఓవరాల్ గా 18 వ రోజున వరల్డ్ వైడ్ గా 32 లక్షల రూపాయల రేంజ్ షేర్ వసూళ్లు వచ్చాయి.

18 రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. ఒక్క నైజం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 14 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇంకో రెండు కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వస్తే , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని దాటేస్తుంది. కానీ అంత దూరం వెళ్తుందో లేదో చూడాలి. ఇక ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి 18 రోజులకు గానూ 11 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నైజాం రన్ తో పోలిస్తే ఆంధ్రా రన్ బాగా తగ్గిందనే చెప్పాలి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 50 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు నుండి ఈ చిత్రానికి 1 కోటి 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్ల 27 లక్షలు , ఓవర్సీస్ నుండి 10 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 43 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 89 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా ఊపుని చూసి కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుతుందేమో అని అంతా అనుకున్నారు , కానీ ఆ రేంజ్ వసూళ్లు కష్టమే అని తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular