Lyrics written by Sitarama Sastry : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇప్పటికే చాలామంది దర్శకులు పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా పేర్లు సంపాదించుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలో కొత్త దర్శకుల నుంచి ఆల్రెడీ ఉన్న మీడియం రేంజ్ దర్శకుల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ప్రస్తుత ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఎవరు ఏ భాషలో సినిమా చేసిన కూడా ఇండియాలో ఉన్న సగటు ప్రేక్షకులందరు ఆ మూవీస్ ను చూసి ఆ సినిమా ఎలా ఉంది అంటూ వాళ్ళ ఒపీనియన్ ను తెలియజేస్తున్నారు. ఒక మొత్తానికైతే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా లో సక్సెస్ సాధించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన కూడా మరొకరు అంతకుమించిన స్టార్ డమ్ ని అందుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు వారిని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో మంచి డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండడం విశేషం… కెరియర్ స్టార్టింగ్ లో నువ్వే కావాలి సినిమాకి డైలాగ్ రైటర్ గా పనిచేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో సీతారామశాస్త్రి ఈ సినిమా కోసం ఒక సాంగ్ అయితే రాశారట.
https://www.facebook.com/reel/1251153849880081?mibextid=6AJuK9
ఆకాశంలో మేఘం ఉంది అంటూ ఆ సాంగ్ రాయడంతో ఆ లిరిక్స్ చదివిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆకాశంలో మేఘం ఉంది అనే లిరిక్స్ డైరెక్ట్ గా వస్తే అంత ఇంపాక్ట్ ఉండడం లేదు. ఏదైనా కథ చెప్పినట్టుగా చెబితే బాగుంటుంది సార్ అని సలహా ఇచ్చారట. దాంతో త్రివిక్రమ్ చెప్పిన సలహా సీతారామ శాస్త్రికి నచ్చి దాని ముందు అనగనగా అని ఆడ్ చేసి అనగనగా ఆకాశం ఉంది అనే సాంగ్ గా మార్చి రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఈ విషయాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెబుతుండడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది… ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస సినిమాలను చేయడానికి సన్నాహాలతో చేసుకుంటున్నాడు. వెంకటేష్ తో చేస్తున్న సినిమా తర్వాత అల్లు అర్జున్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు. మరి ఆ సినిమా మైథాలజికల్ కథతో తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా త్రివిక్రమ్ చేసిన సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపైతే ఉంది. ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…