https://oktelugu.com/

Sirivennela Seetharama Sastry: మన రాకలు, పోకలు మన చేతుల్లో ఉండవు – సిరివెన్నెల సీతారామశాస్త్రి

Sirivennela Seetharama Sastry: ‘పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించినవానికి పుట్టుక తప్పదు, తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నగ్న సత్యాన్ని.. తన పాట రూపంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తెలుగు ప్రేక్షకులకు సరళమైన పదాలతో అలరించే సినిమా పాటల మధ్యన రాసి మనకు జ్ణానాన్ని అందించిన సినిమా రచయిత. అందుకే, ఆయనను కేవలం సినిమా రచయితగా చూడలేం. సీతారామశాస్త్రి గారు ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 1, 2021 1:23 pm
    Follow us on

    Sirivennela Seetharama Sastry: ‘పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించినవానికి పుట్టుక తప్పదు, తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నగ్న సత్యాన్ని.. తన పాట రూపంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తెలుగు ప్రేక్షకులకు సరళమైన పదాలతో అలరించే సినిమా పాటల మధ్యన రాసి మనకు జ్ణానాన్ని అందించిన సినిమా రచయిత. అందుకే, ఆయనను కేవలం సినిమా రచయితగా చూడలేం.

    Sirivennela Seetharama Sastry

    Sirivennela Seetharama Sastry

    సీతారామశాస్త్రి గారు ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. ‘చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా.. నేను మాత్రం చావను ’ అనుకుంటాడు మనిషి. అదే నాకు అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం’ అని అన్నారు. అందరూ చనిపోతారని అందరికీ తెలుసు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి లాంటి వ్యక్తులు ఇక లేరు అంటే.. ఎలా జీర్ణయించుకునేది ?

    మనం రోజూ చూస్తూనే ఉంటాం.. రోజుకు కోకొల్లలుగా చనిపోతూనే ఉంటారు. తప్పదు, వచ్చేవారు పోక తప్పదు, పోయేవారు రాక తప్పదు. చక్రం తిరిగినప్పుడు క్రిందనున్నది పైకి వస్తుంది. పైన ఉన్నది క్రిందకి వస్తుంది. ఈ చక్ర భ్రమణానికి ఏడవడం అనవసరమే. కానీ ఏది మంచి ? ఏది చేదు ? ఏది జ్ఞానం ? ఏది అవసరం ? అని తన సినీ పదాలతో మనకు వివరించిన ఆ కవి లేడు అంటే భరించేది ఎలా ?

    Also Read: Sirivennela: సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి కంటతడి పెట్టిన బాలయ్య

    చిన్నప్పుడు మనం పాఠాశాలలకు వెళ్ళి తరగతి తరువాత తరగతి పూర్తి చేశాం కదా. అలాగే ఈ భూలోకం కూడా ఆత్మజ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠశాల. ఇక్కడికి వస్తాం. కొన్నాళ్ళుంటాం, కొంత నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం. అని ఎలా సరిపెట్టుకోగలం ? జన్మ పరంపరలో పుట్టుకకు సంతోషం, మరణానికి శోకం వెలిబుచ్చడం మానవుని సహజ గుణం.
    అందుకే గురువుగారు ఇక లేరు అని ఏడుద్దాం. మన ఏడుపు చూసి ఆ దేవుడు కూడా ఏడ్చే వరకూ ఏడుద్దాం. అయినా చావు నుంచి తపుంచుకునే వాడు ఎవడు ఉన్నాడు ? ఏ క్షణంలోనైనా చావు రావచ్చు. అందుకే సీతారామశాస్త్రి గారు అంటుండేవారు.. ‘మన రాకలు, పోకలు మన చేతుల్లో ఉండవు. కాబట్టి ప్రతిక్షణంలోనూ మనం పూర్తిగా జీవించాలి అని.

    Also Read: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన మహేష్ బాబు…

    Tags