Sirivenenla Seetharama Sastry: సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత సంవత్సరాల కాలంగా ఫీల్మ్ ఇండస్ట్రీ చేదు వార్తలు వింటూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. అందులో కరోనా మహమ్మారికి బలైనవారు కొందరుంటే.. మరికొందరు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇక మరికొందరు అకాల మరణంతో సినీలోకంతోపాటు.. ప్రేక్షకులు సైతం షాకయ్యారు. ఇలా గత రెండు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎంతోమంది ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ఇక రెండు రోజుల తేడాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూయగా… నిన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని దర్శకుడు రాజమౌళి గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని మ్యూజికల్ వీడియోలో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించా కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం సహకరించ కుదర్లేదని తెలిపారు. కుటుంబం ఆర్ధికంగా చితికిపోయి ఇంటి రెంటు కట్టలేని స్థితికి స్థాయికి పడిపోయిన సమయంలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ సిరివెన్నెల గారు రాసిన పాట తనకు ఎంతో దైర్యం ఇచ్చిందని రాజమౌళి తెలిపారు.
— rajamouli ss (@ssrajamouli) November 30, 2021
కాగా సీతరామశాస్త్రి గారి మరణ వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకున్న సీతరామశాస్త్రి మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతిసంస్కారాలు నిర్వహించే ముందు ఆయన పార్ధివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిమ్ నగర్‌లోని ఫిలిమ్ ఛాంబర్‌లో ఉంచారు. ఈ క్రమంలోనే సిరివెన్నెలను కడసారి చూసుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలతో పాటు పలువురు రాజకీయ నాయకులు సైతం క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా ఫిలిం నగర్ చేరుకుంటున్నారు.