ఈ క్రమంలోనే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ఎన్నో అవమానాలను భరించానని,ఆ అవమానాలను దాటుకుని ప్రస్తుతం ఇక్కడ ఉన్నా అంటూ తన కెరియర్ లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. బీటెక్ చదివిన చంద్రబోస్ 22 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సుమారు 860 చిత్రాలకుపైగా 3,600 పాటలను రాసి ఎంతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా తన ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అవకాశాలను వెతుక్కుంటూ ఎన్నో అవమానాలు పడ్డానని ఈ సందర్భంగా తెలియజేశారు.
అవకాశాల కోసం ఇండస్ట్రీ చుట్టూ తిరిగే సమయంలో కొంచెం చదువు చదువుకున్నాను కనుక నాకు ఇండస్ట్రీలో మంచి గౌరవం ఉంటుందని ఆశించాను.. అయితే తనకు గౌరవం కన్నా అవమానాలు ఎక్కువగా జరిగాయని తెలియజేశారు. అవకాశాల కోసం ఇండస్ట్రీ చుట్టూ తిరిగినప్పుడు ఎం ఏ తెలుగు చేసావా? ఎవరి దగ్గరైనా పని చేశావా? అయినా బీటెక్ చదివి పాటలు రాయడం ఏంటి? ఎక్కడి నుంచి వస్తారు మీలాంటి వాళ్లు? ఇలా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. కనీసం పాట వినకుండా అవమానించి పంపించడంతో ఎంతో బాధపడ్డాననీ తెలిపారు.
మనకు ఏదైనా అవకాశం రావాలంటే కొన్ని మాటలు పడాల్సిందేనని భావించి 100 అవమానాలు ఎదురయ్యే వరకు అవకాశాల కోసం పోరాడుతాను 100 అవమానాలు జరిగితే ఇక ఇండస్ట్రీ వైపు తిరిగి చూడకూడదని భావించాను. ఇలా ఆఫీసుల చుట్టూ వెళ్ళినప్పుడు జరిగిన అవమానాలు వచ్చి ఒక డైరీలో నోట్ చేసుకునేవాడిని. ఇలా ఇరవై ఒక్క అవమానాలు జరిగిన తర్వాత నాకు మొట్టమొదటిసారిగా 1995 తాజ్ మహల్ చిత్రంలో అవకాశం వచ్చింది. అప్పట్లో నేను రాసిన మొట్టమొదటి గీతాన్ని ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు, చిత్ర గారు పాడటం నా అదృష్టం. ఇలా 21 అవమానాల తర్వాత నేను అవమానపడ్డ చోటే సత్కారాలు లభించాయని చంద్రబోస్ తనకు జరిగిన అవమానాలు, సత్కారాలు గురించి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.