Hindu Temples: హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం అవసరమా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అవే జాతీయ విధానాలు అని ప్రజలను నమ్మబలుకుతున్నాయి. అందులో ముఖ్యమైనది హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించడం.. ఇదే నిజమని 75 ఏళ్లుగా ప్రజలను నమ్మించడం అనేది దారుణమని చెప్పొచ్చు.
నిజానికి ఈ క్రీడ మొదలు పెట్టింది బ్రిటీష్ వారు. 1817 లో ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి సారి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. దేశంలో దేవాలయాలు పెద్ద ఆస్తులుగా.. బంగారు, వజ్రాలు, ఆస్తులతో మిగిలిపోయింది కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే. తమిళనాడుతోపాటు మిగతా రాష్ట్రాల్లో ఆలయాల సంపద భారీగా ఉండేది. అందుకే ఈ సంపద కొల్లగొట్టాలని నాటి బ్రిటీష్ ప్రభుత్వం దేవాలయాలను తన ఆధీనంలోకి తీసుకుంది.
అది రానురాను ఎలా అయిపోయిందంటే.. మొదట్లో అన్ని మత సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే మిగతా మతస్థులు గొడవ చేయడంతో కేవలం హిందూ దేవాలయాలనే తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మెజార్టీ మతస్థుల విషయంలోనే ఈ వివక్ష జరగడం విషాదం.
హిందూ దేవాలయాలపై బ్రిటీష్ కాలం నుంచి వివక్ష కొనసాగింది. వీటిని ప్రభుత్వ ఆస్తిగా పరిగణించడం జరిగింది. వాటిని ఏ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదు. ఆలయాలకు వచ్చే నిధులను ఇతర చోట్ల ఖర్చు చేయడం.. స్వచ్ఛంద సేవలు, విద్యాలయాలకు వెచ్చించడం తప్పితే ఏ ప్రభుత్వం కూడా ఆలయాలకు సొంత నిధులు వెచ్చించలేదు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏ విధంగా న్యాయం? అనే అంశంపై ‘రామ్ టాక్’ విశ్లేషణను ఈ వీడియోలో చూడొచ్చు.