https://oktelugu.com/

Pelli SandaD Movie Trailer: ‘పెళ్లి సందD’ ట్రైలర్.. అదే రోమాంటిక్ ఫీల్

Pelli SandaD Movie Trailer: రాఘవేంద్రుడి సినిమా అంటే అదో రంగుల ‘పండ్ల’ ప్రపంచంగా చెబుతుంటారు. ఆయన దర్శకత్వంలో హీరోయిన్లపై వేసినన్ని పండ్లు, పూలు బహుశా ఎవరూ వేసి ఉండరేమో.. ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపు ఊపేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పుడు వృద్ధాప్యంతో ఫేడ్ అవుట్ అయిపోయి సినిమాలు తగ్గించేశాడు. ‘అన్నమయ్య’ తర్వాత ఆయన సినిమాలు ఆడకపోవడం సైడ్అయిపోయాడు. ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. దర్శకత్వ పర్యవేక్షణతో మనముందుకు వస్తున్నాడు. రాఘవేంద్రరావు సినిమాలంటేనే హీరోయిన్లు అత్యంత అందంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2021 / 03:18 PM IST
    Follow us on

    Pelli SandaD Movie Trailer: రాఘవేంద్రుడి సినిమా అంటే అదో రంగుల ‘పండ్ల’ ప్రపంచంగా చెబుతుంటారు. ఆయన దర్శకత్వంలో హీరోయిన్లపై వేసినన్ని పండ్లు, పూలు బహుశా ఎవరూ వేసి ఉండరేమో.. ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపు ఊపేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పుడు వృద్ధాప్యంతో ఫేడ్ అవుట్ అయిపోయి సినిమాలు తగ్గించేశాడు. ‘అన్నమయ్య’ తర్వాత ఆయన సినిమాలు ఆడకపోవడం సైడ్అయిపోయాడు. ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. దర్శకత్వ పర్యవేక్షణతో మనముందుకు వస్తున్నాడు.

    రాఘవేంద్రరావు సినిమాలంటేనే హీరోయిన్లు అత్యంత అందంగా ఉంటారు. వారి బొడ్డు చుట్టు పండ్లు, పూలు వేయిస్తూ పాటలన్నీ ఒక కన్నుల విందుగా చూపిస్తుంటాడు. తాజాగా ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెళ్లి సందD’.శ్రీలీలా హీరోయిన్. దసరాకు సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

    ట్రైలర్ ఆసాంతం నాడు రాఘవేంద్రరావు తీసిన ‘పెళ్లిసందడి’ మూవీని గుర్తుకుతెస్తోంది. ప్రతీ ఫ్రేమ్ ను రాఘవేంద్రరావు మలిచినట్టే కనిపిస్తోంది. పైగా ఇందులో ఆయన నటించారు కూడా..

    ట్రైలర్ చూస్తుంటే ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి ఓ పెళ్లిలో కలుసుకోవడం.. ప్రేమించుకోవడం.. ఆ తర్వాత విడిపోవడం.. మధ్యలో ఫైట్లు.. పాటలు, రోమాంటిక్ సీన్లు వెరిసి రాఘవేంద్రరావు ప్రేమకథా చిత్రాలు చూస్తున్న ఫీలింగ్ తోనే ట్రైలర్ ఆసాంతం సాగింది.

    రోషన్ తో యాక్షన్ కూడా బాగానే చేశారు. ఫైటింగులకు ప్రాధాన్యతి ఇచ్చి పౌరుషత్వాన్ని ఎలివేట్ చేశారు. రాఘవేంద్రరావు ఇందులో నటించి అలరించారు.

    ఇక ఈ చిత్రానికి గౌరీ దర్శకత్వం వహించగా.. సంగీతాన్ని కీరవాణి అందించాడు. అప్పట్లో టాలీవుడ్ ను ఊపు ఊపేసిన పెళ్లి సందడికి అప్డేట్ వెర్షన్ లా వస్తున్న ఈ మూవీ ఎలా అలరిస్తుందో చూడాలి మరీ..