Lucky Baskhar Twitter Talk: లక్కీ భాస్కర్ ట్విట్టర్ టాక్: బ్రిలియంట్ స్కామర్ గా దుల్కర్ సల్మాన్, సినిమాకు అదే హైలెట్!

దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడిక్ క్రైమ్ డ్రామా లక్కీ భాస్కర్. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేశారు. లక్కీ భాస్కర్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. లక్కీ భాస్కర్ ట్విట్టర్ టాక్ పరిశీలిస్తే..

Written By: S Reddy, Updated On : October 31, 2024 9:34 am

Lucky Baskhar Twitter Talk

Follow us on

Lucky Baskhar: దుల్కర్ సల్మాన్ కి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఆయన నటించిన తెలుగు చిత్రాలు మహానటి, సీతారామం భారీ విజయాలు అందుకున్నాయి. సీతారామం మూవీ దుల్కర్ కి తెలుగు ఆడియన్స్ లో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దాంతో దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ మూవీస్ చేస్తున్నారు. ఈసారి ఆయన లక్కీ భాస్కర్ అంటూ టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించాడు. దర్శకుడు వెంకీ అట్లూరి పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా లక్కీ భాస్కర్ తెరకెక్కించారు. ఈ మూవీ ఎలా ఉందో ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

లక్కీ భాస్కర్ మూవీ కథ ఏమిటంటే… భాస్కర్(దుల్కర్ సల్మాన్) ఓ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య మీనాక్షి చౌదరి. చాలీ చాలని జీతంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాడు. ఫ్యామిలీ కష్టాలు చూడలేని భాస్కర్ ఓ కఠిన నిర్ణయం తీసుకుంటాడు. డబ్బులు ఎలాగైనా సంపాదించి కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆర్థిక మోసాలకు పాల్పడతాడు.

కాలం గడిచేకొద్దీ భాస్కర్ కి డబ్బు మీద వ్యామోహం పెరిగిపోతుంది. చిన్న స్కామ్స్ ఉంది పెద్ద స్కామ్స్ చేసే స్థితికి చేరుతాడు. డబ్బు కోసం భాస్కర్ చేసిన మోసాలు ఏమిటీ? అతడి డబ్బు వ్యామోహం తెచ్చిపెట్టిన కష్టాలు ఏమిటీ? లక్కీ భాస్కర్ కథ ఎలా ముగిసింది? అనేది కథ..

లక్కీ భాస్కర్ 90ల నాటి కథ. అప్పటి పరిస్థితులను సెటప్ చేసిన విధంగా చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన ఆర్ట్ వర్క్, హార్డ్ వర్క్ మనం సినిమాలో చూడొచ్చు. సినిమాలో అలరించే ట్విస్ట్స్ ఉన్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి చాలా బ్రిలియంట్ గా సన్నివేశాలు రాసుకున్నారు. కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ సన్నివేశాలు, మలుపులు సినిమాను ఎంగేజింగ్ గా మలిచాయి.

దుల్కర్ సల్మాన్ నటన అద్భుతంగా ఉంది. మైండ్ గేమ్ తో స్కామ్స్ కి పాల్పడే వ్యక్తిగా సహజ నటనతో ఆకట్టుకున్నాడు. దుల్కర్ సల్మాన్ తో పాటు మీనాక్షి చౌదరి మెప్పించే ప్రయత్నం చేసింది. బీజీఎమ్ బాగుంది. మొత్తంగా లక్కీ భాస్కర్ అలరించే క్రైమ్ డ్రామా. ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. లక్కీ భాస్కర్ తో పాటు దీపావళికి విడుదలైన కిరణ్ అబ్బవరం క మూవీ సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.