https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నాకంటే నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం అంటూ పృథ్వీకి మళ్ళీ ప్రపోజ్ చేసిన విష్ణుప్రియ..ఈమె ఈ జన్మలో మారదు!

విష్ణుప్రియ ఆరోజు చాలా బాధపడుతుంది, మళ్ళీ పృథ్వీ జోలికి రాదేమో అని ఆమె అభిమానులు అనుకున్నారు. కానీ అది జరగలేదు, ఎంత రిజెక్ట్ చేసినా నేను నీ వెంటే తిరుగుతాను అంటూ, అతనికి సేవలు చేసుకుంటూ ఉన్నింది. ఇదంతా పక్కన పెడితే డ్యాన్స్ ప్రాక్టీస్ విషయంలో పృథ్వీ రాజ్ తనతో డ్యాన్స్ చేయడానికి ఇష్టపడడం లేదని తెలుసుకొని, బిగ్ బాస్ చాలా రోషంతో మా జంటని మార్చగలరా అని రిక్వెస్ట్ చేస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 31, 2024 / 09:55 AM IST

    Bigg Boss Telugu 8(183)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ ఏ రేంజ్ లో కొనసాగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పృథ్వీ, విష్ణు ప్రియా లవ్ ట్రాక్ చాలా మలుపులు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. పృథ్వీ విష్ణుప్రియ ని ఒక మంచి స్నేహితురాలిగా చూస్తున్నాడు కానీ, విష్ణుప్రియ మాత్రం అలా చూడడం లేదు. పృథ్వీ ని చాలా నిజాయితీగా ప్రేమిస్తుంది. అతను నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు, నాకు ఇక్కడ ఎవరితోనూ రిలేషన్ పెట్టుకోవాలని లేదు, మనం స్నేహితులుగా ఉందాము, నీకు వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడే కట్ చేయడం బెటర్ అని అంటాడు. విష్ణుప్రియ ఆరోజు చాలా బాధపడుతుంది, మళ్ళీ పృథ్వీ జోలికి రాదేమో అని ఆమె అభిమానులు అనుకున్నారు. కానీ అది జరగలేదు, ఎంత రిజెక్ట్ చేసినా నేను నీ వెంటే తిరుగుతాను అంటూ, అతనికి సేవలు చేసుకుంటూ ఉన్నింది. ఇదంతా పక్కన పెడితే డ్యాన్స్ ప్రాక్టీస్ విషయంలో పృథ్వీ రాజ్ తనతో డ్యాన్స్ చేయడానికి ఇష్టపడడం లేదని తెలుసుకొని, బిగ్ బాస్ చాలా రోషంతో మా జంటని మార్చగలరా అని రిక్వెస్ట్ చేస్తుంది.

    ఇది చూసిన తర్వాత అబ్బో, ఈ అమ్మాయికి మొత్తానికి రోషం వచ్చిందే, ఇక నుండైనా అతని వెనుక తిరగకుండా గేమ్ మీద ఫోకస్ పెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ మరుసటి రోజు పృథ్వీ నామినేషన్స్ నుండి సేవ్ అవ్వగానే, ఆనందంతో అతనికి ముద్దు పెట్టడాన్ని గమనించిన ఆడియన్స్ ఇక ఈమె ఈ జన్మకి మారదు అని ఫిక్స్ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ విషయంలో విష్ణు ప్రియ, పృథ్వీ కి మధ్య చిన్నపాటి వాదన జరుగుతుంది. మనోళ్ళని నామినేషన్స్ లో వేయకూడదని అనుకున్నాం కదా, ఎందుకు వేశావు అని పృథ్వీ విష్ణు ప్రియతో గొడవపడుతాడు. ఆ తర్వాత ఆమె రాయల్ క్లాన్ తో చర్చిస్తున్న సమయంలో రోహిణి ‘మళ్ళీ వాళ్ళ వెనుక తిరగకు’ అని అంటుంది. ‘నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను. ఈ సమయంలో నాకు అండగా నిలబడిన వాళ్ళే నాకు నిజమైన స్నేహితులు’ అని చెప్తుంది.

    ఈ మాటకి తగ్గట్టుగానే ఆమె ఒక రోజు పృథ్వికి దూరంగా ఉండడం చూసి, ఇప్పటికైనా ఈమె అతని వెనుక తిరగడం ఆపేసింది, ఇక గేమ్ మీద ఫోకస్ పెడుతుందని అనుకున్నారు ఆడియన్స్. కానీ నిన్న తెల్లవారు జామున 5 గంటలకు పృథ్వీ, విష్ణు మధ్య ఒక చర్చ జరుగుతుంది. పృథ్వీ విష్ణు తో మాట్లాడుతూ ‘నన్ను ఎందుకు నామినేట్ చెయ్యవు’ అని అడుగుతాడు. అప్పుడు విష్ణు ప్రియ ‘నిన్ను ఎలా నామినేట్ చేస్తాను..గత వారం మొత్తం అద్భుతంగా ఆడావు’ అని అంటుంది. ‘ఇప్పుడు ఓకే..నేను అగ్రెస్సివ్ గా ఆడినప్పుడు, చాలా బ్యాడ్ గా ఆడినప్పుడు కూడా నామినేట్ చెయ్యవా?’ అని పృథ్వీ రాజ్ అడగగా, ‘అసలు చేయను..ఎందుకంటే నాకు నా మీద ఉన్న ఇష్టం కంటే, నీ మీద ఉన్న ఇష్టం ఎక్కువ’ అని అంటుంది. దీంతో ఇక ఈమె మారదులే, అంచనాలు పెట్టుకోవడం కూడా వృధా అని ఆమె అభిమానులు సైతం సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.