Lucky Bhaskar Sequel: ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న కొన్ని సినిమాలు అవసరం లేకపోయినా, కథ డిమాండ్ చేయకపోయినా కూడా సీక్వెల్స్ ని ప్రకటించేస్తున్నాయి. దీనికి సీక్వెల్ ఎందుకురా బాబు , అసలు ఏమి చేస్తున్నారు వీళ్ళు అని మనం అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం కచ్చితంగా సీక్వెల్స్ కావాలి అనిపించే సినిమాలు ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘లక్కీ భాస్కర్'(Lucky Bhaskar). దుల్కర్ సల్మాన్(Dulquer Salman) హీరో గా నటించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. థియేట్రికల్ కంటే ఓటీటీ లో అయితే సునామీ నే సృష్టించింది ఈ చిత్రం. దాదాపుగా 12 వారాల పాటు నాన్ స్టాప్ గా టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది ఈ సినిమా. #RRR తర్వాత అన్ని వారాలు ట్రెండ్ అయిన సినిమాగా ‘లక్కీ భాస్కర్’ చిత్రం సరికొత్త రికార్డు ని నెలకొల్పింది.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కించే పని లో ఉన్నాడట డైరెక్టర్ వెంకీ అట్లూరి. ప్రస్తుతం ఆయన తమిళ హీరో సూర్య తో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ‘లక్కీ భాస్కర్ ‘ సీక్వెల్ ని తెరకెక్కిస్తాడని టాక్. విదేశాల్లో స్థిరపడిన భాస్కర్ 2027 వ సంవత్సరం లో ఇండియా కి తిరిగొచ్చి మరో భారీ స్కాం కి శ్రీకారం చుట్టే విధంగా ఆయన పాత్ర ఉంటుందట. ఈ సీక్వెల్ లో కూడా హీరో దుల్కర్ సల్మాన్ నే నటిస్తాడట. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నే కనిపించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరిగ్గా ఈ సీక్వెల్ ని డీల్ చేస్తే కమర్షియల్ గా ఎవ్వరూ ఊహించనంత కలెక్షన్స్ ని రాబట్టే సినిమాగా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.