Lucky Bhaskar : గత ఏడాది దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో నాగ వంశీ నిర్మాణం లో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ మధ్య తరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ ఫలితాన్ని నమోదు చేసుకుంది. దుల్కర్ సల్మాన్ హీరో గ నటించిన మొదటి తెలుగు చిత్రం ‘సీతరామం’ 98 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే, ‘లక్కీ భాస్కర్’ చిత్రం 120 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఇంకా ఎక్కువ వసూళ్లే రావాల్సింది కానీ అదే సమయం లో అమరన్ చిత్రం కూడా పెద్ద హిట్ అవ్వడంతో విపరీతమైన పోటీ ఉన్నందున 120 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ చిత్రానికి థియేటర్స్ లో కంటే ఓటీటీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది.
గత ఏడాది నవంబర్ 28 వ తారీఖున ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈమధ్య గ్యాప్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి, పాన్ ఇండియన్ సినిమాలు వచ్చాయి కానీ ఒక్కటి కూడా ఈ సినిమాని క్రిందకి దించలేకపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రతీ రోజు ఈ సినిమాలను చూసే వారి సంఖ్య ఏ రేంజ్ లో ఉంటుంది అనేది. విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి పది మిలియన్ కి పేజీ వ్యూస్ వచ్చాయట. అంటే కోటి మంది ప్రేక్షకులకు చూసినట్టు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లోకి ‘పుష్ప 2 ‘ వచ్చింది.
ఈ చిత్రం వచ్చిన తర్వాత కూడా ‘లక్కీ భాస్కర్’ జోరు ఏమాత్రం తగ్గలేదు. పుష్ప 2 మొదటి స్థానంలో నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుంటే, లక్కీ భాస్కర్ నాల్గవ స్థానంలో ట్రెండ్ అవుతుంది. గత ఏడాది విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మహారాజా’ నెట్ ఫ్లిక్స్ లో ఆరు నెలల పాటు కొనసాగింది. #RRR తర్వాత ఈ చిత్రమే ఆ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఆ రికార్డుని బద్దలు కొడుతుందని బలమై నమ్మకం తో ఉన్నారు. ఇకపోతే దుల్కర్ సల్మాన్ తదుపరి చిత్రం కూడా తెలుగులోనే ఉంటుందట. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని, సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ‘ఆకాశం లో ఒక తార’ అని ప్రచారం లో ఉంది. పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి.