https://oktelugu.com/

Sankranti Ainyaam : ఆ బాలీవుడ్ హీరోతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్ చేయబోతున్న అనిల్ రావిపూడి..ప్లానింగ్ మామూలుగా లేదుగా!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలైన 17 రోజులకే 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు అతి చేరువైంది ఈ చిత్రం.

Written By: , Updated On : January 31, 2025 / 12:38 PM IST
Sankranti Ainyaam

Sankranti Ainyaam

Follow us on

Sankranti Ainyaam : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలైన 17 రోజులకే 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు అతి చేరువైంది ఈ చిత్రం. వెంకటేష్ నుండి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ ని ఆయన అభిమానులు కూడా ఊహించలేదు. ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా సోలో హీరోగా వెంకటేష్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. ఫ్యామిలీ పల్స్ ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ అనిల్ రావిపూడి కి తెలిసినంతగా ఎవరికీ తెలియదని మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్న అనిల్ రావిపూడి, త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనే సందేహాలు ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే ఇదే అర్థం అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మన తెలుగు ఆడియన్స్ కి ఇలాంటి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ బాగా నచ్చుతాయి. కానీ బాలీవుడ్ ఇలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయా?, భవిష్యత్తులో అక్కడ ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయా? ‘ అని అడగ్గా, దానికి అనిల్ రావిపూడి సమాధానం ఇస్తూ ‘బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు ఆడడం కష్టమే కానీ, అక్కడి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సత్తా కేవలం సల్మాన్ ఖాన్ కి మాత్రమే ఉంది. ఆయన ఒప్పుకుంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని అక్కడ రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టి చూపిస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ సెలెబ్రేషన్స్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే, ఇక వచ్చే నెల నుండి ఆయన మెగాస్టార్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టబోతున్నాడు. మరో రెండు వారాల్లో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అధికారికంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అభిమానులు, ప్రేక్షకులు మెగాస్టార్ లో చూడని కోణాన్ని చూపించి ఆశ్చర్యపరుస్తాను అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత ఆయన సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ని చేసే ఆలోచనలో ఉన్నాడు. వెంకటేష్ గారితో నా సినీ జర్నీ కేవలం మూడు సినిమాలకే పరిమితం కాదని, మా కాంబినేషన్ లో మరో పది సినిమాలు రాబోతున్నారు అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.