https://oktelugu.com/

KGF star Yash : యష్ తప్పు చేశాడా? ఫ్యాన్స్ అనుకున్నదే అయ్యింది… టాక్సిక్ నిర్మాతలకు భారీ లాస్!

కెజిఎఫ్ స్టార్ యష్ ఫ్యాన్స్ కి ఇది ఒకింత చేదు వార్త అనొచ్చు. వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న టాక్సిక్ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా విషయంలో యష్ బుక్ అయ్యాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఏమైందో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : January 31, 2025 / 12:43 PM IST
    KGF star Yash

    KGF star Yash

    Follow us on

    KGF star Yash : కన్నడ కుర్ర హీరో యష్ ఫేట్ మార్చేసింది కెజిఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేశాడు. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా కెజిఎఫ్, కెజిఎఫ్ 2 తెరకెక్కాయి. కెజిఎఫ్ కి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. విడుదలైన అన్ని భాషల్లో కెజిఎఫ్ 2 వసూళ్ల వర్షం కురిపించింది. కన్నడలో టాప్ స్టార్ గా ఎదిగిన యష్.. ఇండియా వైడ్ పాపులారిటీ రాబట్టాడు.

    కెజిఎఫ్ 2 విడుదలై మూడేళ్లు కావస్తుంది. యష్ మరొక చిత్రం చేయలేదు. ఈ విషయంలో యష్ పై ఫ్యాన్స్ ఒత్తిడి కూడా చేశారు. ఏళ్ల తరబడి రెస్ట్ మోడ్ లో ఉన్న నేపథ్యంలో కొత్త మూవీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని అలరించేందుకు మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. అందుకే ఆలస్యం. అభిమానుల సంతోషం, ఆకాంక్షనే నాకు ముఖ్యం.. అంటూ యష్ నచ్చజెప్పే ప్రయత్నం చేయాల్సి వచ్చింది.

    యష్ తో మూవీ చేసేందుకు పలువురు బడా డైరెక్టర్స్ సిద్ధంగా ఉన్నారు. అయితే.. ఆయన ఓ లేడీ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన గీతూ మోహన్ దాస్ తో యష్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి టాక్సిక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గీతూ మోహన్ దాస్ కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైంది. అనంతరం హీరోయిన్ గా కూడా చేశారు. గీతూ కేవలం మూడు చిత్రాలు మాత్రమే దర్శకురాలిగా తెరకెక్కించారు. అవి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్. అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందిన చిత్రాలు.

    అయితే మాస్ కమర్షియల్ సబ్జెక్స్ గీతూ చేసింది లేదు. అలాంటి దర్శకురాలితో మూవీ అనగానే యష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. వారి అనుమానమే నిజమైందనేది లేటెస్ట్ న్యూస్. టాక్సిక్ షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నా కేవలం రెండు షెడ్యూల్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయట. అలాగే రషెస్ చూసిన యష్ నిరాశ పడ్డారట. రీ షూట్ చేయాల్సిందే అని డిసైడ్ అయ్యాడట. ఈ రెండు షెడ్యూల్స్ కొరకు దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు అయ్యాయట. ఆ డబ్బంతా వేస్ట్ అంటున్నారు.

    మరోవైపు సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల అని ప్రకటించారు. తాజా పరిణామాల రీత్యా సమ్మర్ కి టాక్సిక్ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం లేదంటున్నారు. చూస్తుంటే టాక్సిక్ యష్ బ్యాడ్ ఛాయిస్. ఈ మూవీ ఫలితం ప్రతికూలంగా వచ్చే అవకాశం కలదని అంటున్నారు.