Lucky Bhaskar : గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో విడుదలై, భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన ‘లక్కీ భాస్కర్'(Lucky Bhaskar) చిత్రం. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. థియేటర్స్ లో విడుదలై వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఓటీటీ లో కూడా 16 వారాల పాటు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యి మరో సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు ఆమె చేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ చిత్రం లో ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.
ఎలాంటి అతిశయం కి తావు ఇవ్వకుండా, ఒక సాధారణ గృహిణి గా చాలా చక్కటి అభినయాన్ని కనబర్చింది. అయితే ఈ క్యారక్టర్ కోసం ముందుగా మీనాక్షి చౌదరి ని అనుకోలేదట, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ని అనుకున్నారట. బిగ్ బాస్ అంటే మన తెలుగు బిగ్ బాస్ కాదండోయ్, హిందీ బిగ్ బాస్ సీజన్ 17 కి సంబంధించిన ఆయేషా ఖాన్(Ayesha Khan) అనే కంటెస్టెంట్. ఆ సీజన్ లో ఆమె 8 వ స్థానం లో ఎలిమినేట్ అయ్యింది. హిందీ లో బాగా పాపులర్ అయిన ‘బాల్ వీర్’ అనే టీవీ షోలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈమె తన కెరీర్ ని ఆరంభించింది. ఆ తర్వాత పెద్దయ్యాక ‘ముఖ చిత్రం’, ‘ఓం భీం బుష్’, ‘మనమే’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు ని సంపాదించింది. ఇక ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ‘జాట్’ చిత్రం లో కూడా ఈమె కీలక పాత్ర పోషించింది.
అయితే లక్కీ భాస్కర్ చిత్రం లో నటించే అవకాశం వచ్చినప్పటికీ కూడా వదులుకోవడానికి గల కారణాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ఆయేషా. ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కినందుకు ఎంతో సంతోషించాను. కానీ వాళ్ళు అడిగిన సమయం లో నాకు డేట్స్ సర్దుబాటు అవ్వలేదు. అలా అయిష్టంగానే ఈ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది’ అంటూ అయేషా ఖాన్ చెప్పుకొచ్చింది. ఒకవేళ ఆమె ఈ సినిమాని ఒప్పుకొని చేసుంటే, కచ్చితంగా ఆమె కెరీర్ కి మంచి బ్రేక్ దొరికేది. బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకుంది అంటూ సోషల్ మీడియా లో ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అయినా ఈమెకు మంచి బ్రేక్ దొరుకుతుందో లేదో చూడాలి.
Also Read : టీఆర్ఫీ రేటింగ్స్ లో కూడా చరిత్ర సృష్టించిన ‘లక్కీ భాస్కర్’..’కల్కి’ ని డబుల్ మార్జిన్ తో దాటేసిందిగా!