https://oktelugu.com/

‘ఇదే మా కథ’ టీజర్ చూసి హీరో అజిత్ ప్రశంసలు

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కి కేవలం తమిళనాడులో మాత్రమే కాదు దక్షిణాది అంతటా విపరీతంగా ప్రేమించే అభిమానులున్నారు. ఫ్యాన్స్ ఆయనని ముద్దుగా తమిళ్ లో ‘తలా’ (తెలుగులో నాయకుడు) అని పిలుస్తారు. ఆయన కెరీర్ తొలినాళ్లలో తెలుగులో కూడా ‘ప్రేమ పుస్తకం’ అనే సినిమాలో నటించారు. తాజాగా ఆయన ఒక తెలుగు సినిమా విషయంలో స్పందించటం వలన వార్తలలో నిలిచారు. Also Read: లవ్ స్టొరీ, టక్ జగదీష్ వివాదంలో క్లారిటీ శ్రీకాంత్ ‌, సుమంత్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 2, 2021 / 04:14 PM IST
    Follow us on


    కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కి కేవలం తమిళనాడులో మాత్రమే కాదు దక్షిణాది అంతటా విపరీతంగా ప్రేమించే అభిమానులున్నారు. ఫ్యాన్స్ ఆయనని ముద్దుగా తమిళ్ లో ‘తలా’ (తెలుగులో నాయకుడు) అని పిలుస్తారు. ఆయన కెరీర్ తొలినాళ్లలో తెలుగులో కూడా ‘ప్రేమ పుస్తకం’ అనే సినిమాలో నటించారు. తాజాగా ఆయన ఒక తెలుగు సినిమా విషయంలో స్పందించటం వలన వార్తలలో నిలిచారు.

    Also Read: లవ్ స్టొరీ, టక్ జగదీష్ వివాదంలో క్లారిటీ

    శ్రీకాంత్ ‌, సుమంత్ అశ్విన్‌, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కొత్త డైరెక్టర్ గురు పవన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ఇదే మా కథ’. న‌లుగురు వ్య‌క్తులు క‌లిసి ఒక రోడ్ ట్రిప్ ఎలా మొదలు పెట్టి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, చివరకి ఎలా ముగించారు అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.

    Also Read: టీజర్ తో ఆకట్టుకుంటున్న ”సుల్తాన్‌” !

    తాజాగా విడుదలయిన ఈ మూవీ టీజర్ మీద హీరో అజిత్ ప్రశంసల వర్షం కురిపించారు. “తన స్నేహితుడు రామ్‌ ప్రసాద్‌ గారు ‘ఇదే మా కథ’ సినిమా టీజర్‌ను చూపించారని, సినిమా టీజర్‌ చాలా బాగా తీశారని పేర్కొన్నాడు. త్వరలోనే చిత్ర యూనిట్‌ను కలుస్తానని” అజిత్‌ మాటిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా మీద హైప్ రావటంతో చిత్ర యూనిట్ సంతోషంలో ఉన్నారట. వాస్తవానికి నిజ జీవితంలో అజిత్ ఒక ప్రొఫెషనల్ బైక్ రేసర్, ఆ ఇష్టంతోనే ఈ సినిమా మీద ఆయన ఆసక్తి కనబరుస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు .

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్