https://oktelugu.com/

‘లవ్ స్టోరి’ రివ్యూ

నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి, ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, దేవయాని తదితరులు. దర్శకుడు: శేఖర్ కమ్ముల సినిమాటోగ్రఫీ: విజయ్ సి. కుమార్ ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్ సంగీత దర్శకుడు: పవన్ సి హెచ్ నిర్మాతలు : నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘లవ్ […]

Written By: admin, Updated On : September 24, 2021 4:19 pm
Follow us on

నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి, ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, దేవయాని తదితరులు.
దర్శకుడు: శేఖర్ కమ్ముల
సినిమాటోగ్రఫీ: విజయ్ సి. కుమార్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్
సంగీత దర్శకుడు: పవన్ సి హెచ్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు

సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘లవ్ స్టోరీ’. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

కథ :
తక్కువ కులంలో పుట్టిన రేవంత్ (నాగచైతన్య) చిన్నతనం నుంచే పని చేసి డబ్బు సంపాదించాలనే పట్టుదలతో ఉంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో జుంబా సెంటర్ నడుపుతూ ఉంటాడు. అయితే, మౌనిక (సాయిపల్లవి) జాబ్ కోసం ఊరు నుంచి రేవంత్ ఉండే ఇంటి పక్క ఇంట్లో దిగుతుంది. ఇక కొన్ని సీన్స్ అనంతరం మౌనిక కూడా రేవంత్ జుంబా సెంటర్ లో పార్టనర్ గా జాయిన్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమలో పడుతుంది. కానీ ఇద్దరు కులాలు వేరు, వారి ప్రేమకు కులం అడ్డంకి అవుతుంది. మరి ఆ అడ్డంకులను దాటుకుని రేవంత్ – మౌనీ తమ ప్రేమను ఎలా గెలుచుకున్నారు ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
డ్యాన్స్ ట్రైనర్ గా నాగ చైతన్య, డ్యాన్సర్ గా సాయి పల్లవి ఇద్దరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. లవ్ సీన్స్ నుంచి ఎమోషనల్ సన్నివేశాల వరకూ ఇద్దరు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మెయిన్ గా క్లైమాక్స్ లో చైతు నటన, సాయి పల్లవి డ్యాన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

కీలక పాత్రలో నటించిన రాజీవ్ కనకాల, ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన ఈశ్వరి రావు అద్భుతంగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. శేఖర్ కమ్ముల, వాస్తవ జీవితాల్లోని సంఘటనలను, పరిస్థితులను బాగా చూపించాడు.

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్… ఈ కథ జరిగిన నేపథ్యం, సహజంగా సాగే పాత్రలు, సినిమా చూస్తున్నంత సేపు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలగడం, అలాగే డైరెక్టర్ రాసుకున్న సున్నితమైన భావోద్వేగాలు కొన్ని చోట్ల అబ్బురపరుస్తాయి.

ప్లస్ పాయింట్స్ :
చైతు నటన, సాయి పల్లవి డ్యాన్స్,
కథ,
మిగిలిన నటీనటుల నటన,
సంగీతం,
ఎమోషనల్ గా సాగే లవ్ డ్రామా,

మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్,
రెగ్యులర్ స్క్రీన్ ప్లే,
బోరింగ్ డ్రామా,
రొటీన్ సీన్స్,

సినిమా చూడాలా ? వద్దా ?
సాయి పల్లవి, నాగ చైతన్య తమ నటనతో ఈ సినిమా స్థాయిని పెంచారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది. కానీ, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, మోటివ్ సీన్స్ ఇంకా బలంగా ఉండాల్సిందనే ఫీలింగ్ కలగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఓవరాల్ గా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

రేటింగ్ : 2.5

Tags