Raja Saab Censor Talk : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(The Rajasaab) మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందు రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. జనవరి 8న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ షో పడనుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు UA సర్టిఫికేట్ ని జారీ చేశారు. సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాల వరకు ఉంటుందట. ఒక హారర్ సినిమాకు ఈ రేంజ్ రన్ టైం ఉండడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇదే తొలిసారి. అయితే సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన టాక్ ని చూస్తే కడుపుబ్బా నవ్వే సినిమా అని చెప్పినట్టు సమాచారం.
ఫస్ట్ హాఫ్ కాస్త కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందట కానీ, సెకండ్ హాఫ్ కూడా బాగానే నడుస్తుందని అంటున్నారు.. క్రింజ్ కామెడీ సన్నివేశాలతో పాటు, ప్రతీ సన్నివేశాన్ని బాగా తీర్చిదిద్దారని.. ఆడియన్స్ కి మంచి ఫీలింగ్ వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎంగేజింగ్ గా ఉందని అంటున్నారు. దాదాపుగా 45 నిమిషాల క్లైమాక్స్ అట, ఉత్కంఠ భరితంగా, హారర్ ఎలిమెంట్స్ తో భయం రప్పించే విధంగా ఉండదట. చూసే ఆడియన్స్ కి ఉత్కంఠ ఫీలింగ్ వస్తుందట.
అంతే కాకుండా ప్రభాస్ కూడా ఫైనల్ ఔట్పుట్ ని బాగుందని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. సో థియేటర్లకు ఇక జనాలు క్యూ కట్టడం ఖాయం..