Jana Nayagan Trailer Review : తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్'(Jana Nayagan Movie) మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళనాట ఇదే విజయ్ చివరి చిత్రమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సినిమా తర్వాత ఆయన శాశ్వతంగా నటనకు గుడ్ బై చెప్పి రాజకీయాలకు తన మిగిలిన కెరీర్ ని కేటాయించాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే TVK పార్టీ ని స్థాపించి ఎన్నో సభలు, ర్యాలీలు నిర్వహించాడు. కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఘటన తర్వాత విజయ్ పొలిటికల్ కెరీర్ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. రీసెంట్ గానే విజయ్ తన రాజకీయ ప్రయాణం ని మళ్లీ మొదలు పెట్టాడు. ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు.
ఇది కాసేపు పక్కన పెడితే మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘జన నాయగన్’ థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. తమిళం తో పాటు, తెలుగు , హిందీ భాషల్లో కూడా ఈ ట్రైలర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత మనకు గుర్తుకు వచ్చిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఇంట్రడక్షన్ సన్నివేశం , ఇంటర్వెల్ సన్నివేశం, మధ్యలో వచ్చిన షాట్స్ అన్నిటిని చూస్తుంటే భగవంత్ కేసరి ని మళ్లీ చూస్తున్నట్టుగా అనిపించింది. కానీ ఇక్కడ రాజకీయ ఎలిమెంట్స్ ని జోడించినట్టు తెలుస్తోంది. హీరో ని రాజకీయాల్లోకి రానివ్వకుండా విలన్స్ అడ్డుకునే లాగా ఒక చిన్న ఎలిమెంట్ ని జత చేశారు. అంతే కాకుండా విలన్ బ్యాక్ డ్రాప్ కూడా కాస్త కొత్తగా సెట్ చేశారు. ట్రైలర్ చివరి షాట్ లో విజయ్ రోబో తో ఫైట్ చేయడం హైలైట్ గా నిల్చింది.
భగవంత్ కేసరి లో విలన్ కి అలాంటి బ్యాక్ డ్రాప్ ఏమి ఉండదు. ఇకపోతే ఇందులో శ్రీలీల క్యారెక్టర్ ని మమిత బైజు చేయగా, కాజల్ అగర్వాల్ క్యారక్టర్ ని పూజ హెగ్డే చేసింది. అదే విధంగా భగవంత్ కేసరి లో విలన్ క్యారెక్టర్ ని అర్జున్ రాంపాల్ చేయగా, ఇక్కడ అదే క్యారక్టర్ ని బాబీ డియోల్ చేసాడు. భగవంత్ కేసరి చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. అలాంటి సినిమాకు రీమేక్ అంటే సాహాసం అనే చెప్పాలి. ఇది రీమేక్ అనే విషయం చాలా రోజుల క్రితమే తెలుసు. కానీ ప్రస్తుత ట్రెండ్ లో రీమేక్ అంటే ఆడియన్స్ పట్టించుకోవడం మానేస్తారు అనే భయం తో దీనిని రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఇక నేడు ట్రైలర్ వచ్చిన తర్వాత ఇది రీమేక్ అని అందరికీ అర్థం అయిపోయింది. సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారిన ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.