
BiggBoss 5 Telugu: దేశంలోనే అత్యధిక రేటింగ్ తో కొనసాగుతోంది బిగ్ బాస్ తెలుగు షో. ఈ రియాలిటీ షోను తెలుగు జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే రెండు వారాలు పూర్తికాగా.. మూడో వారంలోకి షో అడుగుపెట్టింది. మొదటి వారం ‘సరయు’ ఎలిమినేట్ కాగా.. రెండో వారం బూతులతో రెచ్చిపోయిన ఉమాదేవిని ఇంటి నుంచి బయటకు పంపారు.
బిగ్ బాస్ విజేతలుగా గెలిచిన వారు గతంలో సామాజికసేవ చేసి అందరి మనసు గెలుచుకున్నారు. గతంలో విజేతలైన శివబాలాజీ, కౌశిక్ లతోపాటు ఎంతో మంది తమకు షో ద్వారా అందిన రెమ్యూనరేషన్ ను పేదల కోసం, స్వచ్చంద సేవల కోసం ఖర్చు చేశారు.
తాజాగా బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారంలోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఉమాదేవి కూడా వీరి బాటలోనే నడిచారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. సీరియల్స్ లో ఎన్నో పాత్రలు చేస్తూ ‘గయ్యాలీ గంగమ్మ’గా పేరు తెచ్చుకున్న ఉమాదేవి నిజజీవితంలో మాత్రం తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆమె ఉన్నది రెండు వారాలే.. గొడవలతో హౌస్ లో కాకరేపింది. అయితే బయటకొచ్చాక తనకు వచ్చిన రెమ్యూనరేషన్ ను మాత్రం మంచి పని కోసం వినియోగించి అందరి మనసులు గెలుచుకుంది.
తన బిగ్ బాస్ లో వచ్చిన పారితోషికంలోంచి బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ఉమాదేవి అందించడం విశేషం. ఉమాదేవి చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె నోరు సంగతి ఎలా ఉన్నా కూడా.. ఆమె చేష్టలు మాత్రం ఇప్పుడు అందరి అభిమానాన్ని చూరగొన్నాయి.