Pawan Kalyan : నేడు కొండగట్టు అంజనేయ స్వామి ని దర్శించుకొని అక్కడ 30 కోట్ల రూపాయిల విలువగల 9 గదుల వసతి గృహాల శంకుస్థాపన కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తో పవన్ కళ్యాణ్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2009 ఎన్నికల సమయం లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కి కరెంటు తీగలు తగిలి షాక్ కొట్టింది. అలాంటి షాక్ నుండి కూడా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సురక్షితంగా బయటపడ్డాడు. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ని విపరీతంగా ఆరాధిస్తూ వస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా ఆ ఆలయాన్ని సందర్శించుకుంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్.
రీసెంట్ గానే తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున ఆ ఆలయాన్ని సందర్శిచుకోవడానికి వచ్చే వేలాది మంది భక్తుల కోసం 9 గదుల వసతి గృహం నిర్మించడం కోసం 35 కోట్ల రూపాయిలను విడుదల చేయించాడు. నేడు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మైన్ BR నాయుడు, దర్శకుడు హరీష్ శంకర్ , ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తదితరులు హాజరయ్యారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ని చూసేందుకు ఈరోజు వచ్చిన అభిమాన సముద్రం చూసి అక్కడి వాళ్లంతా షాక్ కి గురయ్యారు. కనుచూపు మేర ఎక్కడ చూసినా జనమే. కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ ని చూడడం కోసం చెట్లు, కరెంటు స్తంబాలు కూడా ఎక్కేసారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా సార్లు కొండగట్టు కి వచ్చాడు. అయినప్పటికీ ఈ రేంజ్ ఆదరణ జనాల నుండి రావడం విశేషం.
ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య కారు ర్యాలీ లో వెళ్తున్న సమయం లో ఆయన కారు మీద కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది. గతం లో ఆయన ఇప్పటం గ్రామానికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగె కారు మీద కూర్చొని స్టైల్ గా వెళ్ళాడు. ఇలా వెళ్లడం అత్యంత ప్రమాదకరం. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థానం లో కూర్చొని పవన్ కళ్యాణ్ యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నాడు అంటూ కొంతమంది నిలదీశారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో కారు మీద పడుకుంటాడు కూడా. కూర్చోవడమే అత్యంత ప్రమాదం అంటుంటే, పడుకోవడం ఏంటో?, ఈ ఫీట్స్ అందుకు అని పవన్ కళ్యాణ్ ని నిలదీస్తున్నారు దురాభిమానుల. కానీ ర్యాలీ మధ్యలో కరెంటు తీగలు రావడం వల్లే పవన్ కళ్యాణ్ అలా పడుకున్నాడని, అందుకు సంబంధించిన వీడియో ఇదే అంటూ అభిమానులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
పవన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి తిరుగు ప్రయాణంలో కారుపై నిలబడి అభిమానులకు అభివాదం చేసిన పవన్, ఎదురుగా ఉన్న కేబుల్ గమనించి వెంటనే వంగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. pic.twitter.com/GOyHyaffxp
— greatandhra (@greatandhranews) January 3, 2026