https://oktelugu.com/

Megastar-Prabhas: ‘అటు ప్రభాస్ – ఇటు మెగాస్టార్ ‘ ఇద్దరిదీ ఒకే ప్లానింగ్ !

Megastar-Prabhas: మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ ప్రస్తుతం ఓకె ప్లాన్ తో ముందుకు పోతున్నారు. అదేంటి చిరు – ప్రభాస్ ఇద్దరూ ఒకే బాటలో ఎలా పయనిస్తున్నారు ? ఒకరు సీనియర్ హీరో, మరొకరు యంగ్ పాన్ ఇండియా స్టార్. వీరిద్దరికీ ఒకే కెరీర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది ? పైగా చిరు శైలి వేరు, ప్రభాస్ స్టైల్ వేరు, మరి ఇద్దరిదీ ఒకే శైలి, ఒకే పయనం ఎలా అవుతుంది ? మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం […]

Written By:
  • Shiva
  • , Updated On : December 29, 2021 / 10:54 AM IST
    Follow us on

    Megastar-Prabhas: మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ ప్రస్తుతం ఓకె ప్లాన్ తో ముందుకు పోతున్నారు. అదేంటి చిరు – ప్రభాస్ ఇద్దరూ ఒకే బాటలో ఎలా పయనిస్తున్నారు ? ఒకరు సీనియర్ హీరో, మరొకరు యంగ్ పాన్ ఇండియా స్టార్. వీరిద్దరికీ ఒకే కెరీర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది ? పైగా చిరు శైలి వేరు, ప్రభాస్ స్టైల్ వేరు, మరి ఇద్దరిదీ ఒకే శైలి, ఒకే పయనం ఎలా అవుతుంది ?

    Megastar-Prabhas

    మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం నాలుగు చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఆచార్య సినిమా ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయింది. ఇక మిగిలిన మూడు సినిమాలు ఆల్ రెడీ సెట్స్ పై షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఎలాగూ ఫిబ్రవరిలో చిరంజీవి ‘ఆచార్య’ రాబోతుంది. ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

    Also Read: గోవాలో లగ్జరీ రిసార్ట్ లో ఆమెతో సమంత సంబరాలు !

    ఇక ఆ తర్వాత ‘భోళా శంకర్’, ‘వాల్తేర్ వీరయ్య’ లాంటి సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేస్తారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ మూడు చిత్రాలు ఇంకా షూటింగ్ దశలో ఉండగానే మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంటే, ‘ఆచార్య’ సినిమా మినహాయిస్తే… మెగాస్టార్ ఇప్పుడు వరుసగా నాలుగు సినిమాలను చేస్తున్నాడు.

    ఇటు ప్రభాస్ కూడా మెగాస్టార్ నే ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత ‘సలార్’ సినిమాను సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కే’ లాంటి సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేస్తారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రాలు ఇంకా షూటింగ్ దశలో ఉండగానే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’ అనే మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అటు ప్రభాస్ ఇటు చిరు ఒకే ప్లానింగ్ తో ముందుకు పోతుండటం నిజంగా విశేషమే.

    Also Read: సింహం బలం పులి తెగింపు కలిపితే లైగర్ !

    Tags