OG Movie Story Leaked: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి సినిమా ఈనెల 25 తేదీన ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఈ సినిమాకి సుజీత్ డైరెక్షన్ చేయడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా సుజీత్ ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని తనను తాను ఎలివేట్ చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక సుజిత్ ఓజీ సినిమాతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతొంది అనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ క్యారెక్టర్ ని పోషిస్తుంటే ఇమ్రాన్ హష్మీ ‘ఓమీ’ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.
ఇక వీళ్లిద్దరూ బ్రదర్స్ గా కనిపించబోతున్నారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే ఒక యుద్దంగా తెలుస్తోంది. వీళ్ళిద్దరిలో ఒకరు మంచిగా ఉంటే, మరొకరు విలన్ గా ఎందుకు మారడు అనేది ఈ సినిమా బ్యాక్ స్టోరీ గా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఇమేజ్ ను సంపాదించి పెడుతోంది.
తద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకున్న రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది… ఇక ఓజి, ఓమి మధ్య బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. తమ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చేయడం వల్ల ఇద్దరిలో ఒకరు విలన్ గా, మరొకరు హీరోగా మారినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాను సుజీత్ జపనీస్ డైరెక్టర్ల స్టైల్ లోనే తెరకెక్కించినట్టుగా విజువల్స్ చూస్తే అర్థమైపోతోంది… ఇక సుజిత్ ఇంతకు ముందు చేసిన సాహో సినిమా తెలుగులో ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా బాలీవుడ్ లో మాత్రం సూపర్ హిట్ ను అందుకుంది…ఇక ఓజీ విషయంలో మాత్రం తన లెక్కలు మారవని ఈ సినిమాతో తప్పకుండా సూపర్ సక్సెస్ ను సాధిస్తానని సుజీత్ చాలా క్లారిటీ గా ఉన్నాడు…