https://oktelugu.com/

Lokesh Kanakaraju: లోకేష్ కనకరాజు, శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ ముగ్గురు కలిసి ఒక తెలుగు సినిమా చేయబోతున్నారా..? ఇంతకీ హీరో ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి ఎవరికి వారు తమదైన రీతిలో సత్తా చాటాల్సిన అవసరమైతే ఉంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నారు... ఇక అదే రీతిలో కుర్ర హీరోలు కూడా ప్రయోగత్మమైన సినిమాలను సినిమాలను చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 / 12:11 PM IST

    Lokesh Kanakaraju

    Follow us on

    Lokesh Kanakaraju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న దర్శకులు ఎంతమంది ఉన్నప్పటికీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా తమదైన రీతిలో సత్తా చాటుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే శంకర్ లాంటి డైరెక్టర్ ఒకప్పుడు పెను ప్రభంజనాలను సృష్టించాడు. ఇక ఇప్పుడు ఆయన ఫామ్ ని కొంతవరకు కోల్పోయినప్పటికి మరోసారి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసి భారీ సక్సెస్ ను అందుకోవాలనే ప్రయత్నంలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే శంకర్, లోకేష్ కనకరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ ముగ్గురూ కలిసి ఒక తెలుగు హీరోతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే శంకర్ తెలుగు హీరో అయిన రామ్ చరణ్ తో సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ముగ్గురు కలిసి ఒక హీరోతో ఎలా సినిమా చేస్తారనే డౌట్ అందరిలో రావచ్చు. కానీ శంకర్ ప్రొడ్యూసర్ గా కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తుండగా లోకేష్ కనకరాజ్ ఆ సినిమాను డైరెక్షన్ చేస్తాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ వీళ్ళు ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ కనకరాజ్ ఆల్రెడీ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

    కాబట్టి ఈ సినిమా విషయంలోనే వీళ్ళు ఈ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కార్తిక్ సుబ్బరాజు కథలు చాలా అద్భుతంగా ఉంటాయనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. ఇక గేమ్ చేంజర్ సినిమాకి కూడా కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

    మరి ఇప్పుడు కూడా అలాంటి స్ట్రాటజీ నే మెయింటేన్ చేస్తూ మొత్తానికైతే తమిళ్ సినిమా ఇండస్ట్రీని ఒక మెట్టు పైకి ఎక్కించాలనే ఉద్దేశ్యంతో ఈ ముగ్గురు దర్శకులు కూడా తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.

    ఇక వీళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఎన్టీఆర్ భాగం అవుతాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఈ సినిమా పట్టలెక్కితే మాత్రం తమిళ్ సినిమా ఇండస్ట్రీ కి మంచి పేరు వస్తుందనే చెప్పాలి…