https://oktelugu.com/

Balineni Srinivasa Reddy: పవన్ మిషన్ తో పని చేస్తున్న బాలినేని.. జగన్ కు షాక్!

మాజీ సీఎం జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అదా నీ కేసులో తాను ముడుపులు అందుకున్నానని విపక్షాలు గోలగోల చేస్తున్నాయి. అది నిజమే నన్నట్టు ఇంధన శాఖామంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా చెబుతున్నారు. దీంతో తప్పు జరిగిందని ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 24, 2024 12:06 pm
    Balineni Srinivasa Reddy

    Balineni Srinivasa Reddy

    Follow us on

    Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు. ఆయన జగన్ కు అత్యంత విధేయుడు. దగ్గరి బంధువు కూడా.అందుకే ఆయన జనసేనలో చేరుతారంటే చాలా రకాల అనుమానాలు వెంటాడాయి. అది జగన్ ఆపరేషన్ గా అందరూ అనుమానించారు. జనసేనలో ప్రవేశించి.. కూటమిని విచ్చిన్నం చేయాలన్న వ్యూహంతోనే బాలినేని జనసేనలోకి వచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ జగన్ మిషన్ ను బాలినేని అమలు చేస్తున్నారో లేదో కానీ.. అదే జగన్ ను నిర్వీర్యం చేయాలని మాత్రం ఇప్పుడు చూస్తున్నారు. జగన్ క్యాబినెట్లో కీలక మంత్రిత్వ శాఖను నిర్వర్తించడంతో అప్పటి లోపాలను, అవినీతిని, ఒప్పందాలను బయటపెడుతున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎక్కడో యువజన కాంగ్రెస్ లో ఉన్న బాలినేనిని వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. ఎమ్మెల్యేను చేయడమే కాదు మంత్రిగా కూడా చేశారు. ఆ అభిమానంతోనే జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చారు. కానీ మూడు సంవత్సరాల తర్వాత తొలగించారు. అప్పటినుంచి క్రమేపి జగన్ కు దూరమవుతూ వచ్చారు బాలినేని.

    * అప్పటినుంచి జగన్ తో బాలినేని దూరం
    మంత్రి పదవులు ఇచ్చినప్పుడే జగన్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. మూడేళ్ల తర్వాత పునర్వ్యవస్థీకరణలో తొలగిస్తానని చెప్పినట్లు సమాచారం. అందుకే అప్పట్లో మంత్రి బాలినేనిని తప్పించారు. అదే సమయంలో పెద్దిరెడ్డి, బొత్స, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలం సురేష్ వంటి వారిని కొనసాగించారు. వారి మాదిరిగా తనను ఎందుకు కొనసాగించ లేదన్నది బాలినేని ప్రశ్న. నువ్వు నా వాడివి కదా అని జగన్ నుంచి వచ్చిన మాట. ఇలా బాలినేనిలో రేగిన అసంతృప్తి క్రమేపి పెరిగింది. చివరకు జనసేన బాట పట్టించే వరకు వచ్చింది. అయితే బాలినేని జనసేనలోకి పంపించింది జగనేనని ప్రచారం జరిగింది. జగన్ పంపించారో లేదో తెలియదు కానీ.. అదే బాలినేని సేవలను మాత్రం పవన్ వాడుకుంటున్నారు. అదే బాలినేని ద్వారా జగన్ ను పలుచన చేయడంలో విజయవంతం అయ్యారు.

    * వైఫల్యాలను బయటపెడుతున్న వైనం
    ఆదాని అవినీతి కేసులో జగన్ పేరు బయటకు వచ్చింది. విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక 1750 కోట్ల రూపాయల డీల్ జరిగిందన్నది జగన్ పై వచ్చిన అభియోగం. అయితే నాడు ఇంధన శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అర్ధరాత్రి లేపి ఆ ఒప్పందాల పత్రాలపై సంతకం చేయమని కోరారని నాటి సంగతులను గుర్తు చేశారు బాలినేని. అయితే అందులో మతలబు ఉందని గ్రహించి తాను సంతకం పెట్టలేదని చెప్పుకొచ్చారు. క్యాబినెట్ ఎదుట ప్రవేశపెట్టి ఆమోదం పొందారని చెప్పారు. అదంతా జగన్ కనుసన్నల్లో జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా బాలినేని వచ్చి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అసలు సంగతి అర్థమైంది. బాలినేని జగన్ ఆపరేషన్ కాదని.. పవన్ ఆపరేషన్ అమలు చేసేందుకే జనసేనలోకి వచ్చారని స్పష్టమైంది. విశ్లేషకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.