https://oktelugu.com/

Rajinikanth: ఆ విషయం లో రజినీకాంత్ ను ఇబ్బంది పెడుతున్న లోకేష్ కనకరాజ్…మరి సూపర్ స్టార్ రియాక్షన్ ఏంటి..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా వరకు సక్సెస్ లతో ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే...ఇక అదే విధంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ కూడా తనదైన రీతిలో వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : September 12, 2024 / 09:56 AM IST

    Rajinikanth Coolie

    Follow us on

    Rajinikanth: ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి నటులు కూడా చాలా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. అయితే వీళ్ల తర్వాత వచ్చిన హీరోలు కూడా తెలుగులో చాలా మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. గత సంవత్సరం జైలర్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న రజినీకాంత్ ఈ సినిమాతో ఏకంగా 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాడు అంటే మామూలు విషయం కాదు.

    ఆయన ఈ ఏజ్ లో కూడా చాలా కష్టపడుతూ ఏ హీరోలకు సాధ్యం కానీ రీతిలో ఎన్నో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో కూలి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే తనదైన రీతిలో ఈ సినిమాని లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విక్రమ్ సినిమాతో లోకేష్ కి పాన్ ఇండియా వైడ్ గా చాలా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది.

    ఇక మధ్యలో వచ్చిన ‘లియో ‘ సినిమా ఆశించిన విజయం సాధించినప్పటికి దర్శకుడిగా మాత్రం లొకేషన్ కనకరాజు ఎప్పుడు ఫేయిల్ అవ్వలేదనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే లోకేష్ కనకరాజ్ రజినీకాంత్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేయిస్తున్నాడనే టాక్ అయితే వస్తుంది. నిజానికి ఈ ఏజ్ లో ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించడం అనేది అసాధ్యయమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన బాడీ ఆయనకి సరిగ్గా సపోర్ట్ చేయదు. కాబట్టి ఎక్కువ శాతం డూప్ ని వాడుతూ ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది. కానీ లోకేష్ కనకరాజ్ మాత్రం డూప్ ని ఎక్కువసార్లు వాడితే ఆ ఫీల్ రావడం లేదని ఉద్దేశ్యంతో కొన్ని షాట్స్ లో రజనీకాంత్ తో డైరెక్ట్ గా యాక్షన్ ఎపిసోడ్స్ చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక దీని వల్ల రజనీకాంత్ కొంత వరకు ఇబ్బంది పడుతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ సినిమా కోసం ఏదైనా చేయగలిగే స్వభావం ఉన్న రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ ఏది అడిగితే అది చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ రజినీకాంత్ అభిమానులు మాత్రం లోకేష్ కనకరాజ్ ను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏజ్ లో ఆయన్ని అంతలా కష్టపెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన స్టైల్ , మేనరిజమ్స్ చూపిస్తూ అటు ఇటు నడిచిన కూడా మేము అతని సినిమాలను ఆదరిస్తాము. ఎందుకు నువ్వు ఆయన్ని అంతలా ఇబ్బంది పెడుతున్నావు అంటూ రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ లోకేష్ తర్వాత మాత్రం యాక్షన్ సీన్స్ న్యాచురల్ గా ఉండడం కోసమే ఆయన అలాంటి డిసిజన్ తీసుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…