https://oktelugu.com/

Vijay Leo 2: లియో 2 రెడీ చేసిన లోకేష్ కనగరాజ్… విజయ్ ఈ సినిమా చేస్తాడా..? లేదా..?

Vijay Leo 2: గత సంవత్సరం వచ్చిన లియో సినిమాతో మరోసారి తనని తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : June 19, 2024 / 01:01 PM IST

    Lokesh Kanagaraj who made Leo 2

    Follow us on

    Vijay Leo 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో లోకేష్ కనకరాజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు ఆయన చేసిన ఖైదీ, మాస్టర్, విక్రమ్, లాంటి సినిమాలు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక విక్రమ్ సినిమాతో ఒక్కసారిగా ఆయన ఓవర్ నైట్ తో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

    ఇక గత సంవత్సరం వచ్చిన లియో సినిమాతో మరోసారి తనని తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు లియో సినిమా కి సంబంధించిన పార్ట్ 2 ను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో ఎలాంటి కథాంశాన్ని చూపించబోతున్నాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. లియో సినిమాలో ఆయన చూపించింది చాలా తక్కువ అందువల్లే లియో 2 సినిమాలో స్టోరీ మొత్తాన్ని భారీ రేంజ్ లో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ రకంగా ఈయన ముందుకు కదిలితే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

    Also Read: Breaking News: చిరంజీవి మాజీ అల్లుడు మృతి… తండ్రిని కోల్పోయిన శ్రీజ కూతురు!

    కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి సమయంలో ఈ సినిమా విజయ్ తోనే చేస్తాడా లేదంటే మరెవరితో అయిన చేస్తాడా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి…

    Also Read: Akhil: ఏ వారసుడికి జరగని ఘోర అవమానం అఖిల్ కే జరుగుతుందా..? ఎందుకిలా అవుతుంది..?

    ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దగ్గర ఖైదీ 2, విక్రమ్ 2 సినిమా స్టోరీలు బౌండెడ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీటిలో మరి ఏ సినిమాని ముందు స్టార్ట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే లోకేష్ కనకరాజ్ మరోసారి తను భారీ సక్సెస్ అయితే కొట్టాలని చూస్తున్నాడు…