Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఒక్కటి చాలు..

ఇప్పుడున్న బీజీ షెడ్యూల్స్ కు చాలా మంది వంటకు ప్రాధాన్యం ఇవ్వకుండా బయట ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వంట చేసే సమయం లేదని బయట కర్రీలు, బిర్యానీలను ఆర్డర్ పెట్టుకొని మరీ తింటున్నారు.

Written By: Swathi Chilukuri, Updated On : June 19, 2024 12:59 pm

Health Tips

Follow us on

Health Tips: ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు మధుమేహం మరికొందరు థైరాయిడ్, క్యాన్సర్, టీబీ ఇలా చెప్పుకుంటూ పోతే సాధారణ వ్యాధుల నుంచి మొదలు పెడితే అసాధారణ వ్యాధులు కూడా వెంటాడుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారం, వాతావరణంలో మార్పులు, బిజీ లైఫ్ వంటివి వ్యాధులకు కారణం అవుతున్నాయి. అందుకే కొన్ని ఆహార నియమాలను పాటించాలి. లేదంటే మీ చేతులారా మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకున్న వారు అవుతారు.

ప్రైడ్ రైస్, సఇప్పుడున్న బీజీ షెడ్యూల్స్ కు చాలా మంది వంటకు ప్రాధాన్యం ఇవ్వకుండా బయట ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వంట చేసే సమయం లేదని బయట కర్రీలు, బిర్యానీలను ఆర్డర్ పెట్టుకొని మరీ తింటున్నారు. మోసా, నూడిల్స్ అంటూ ఏదో ఒకటి తిని ఆకలిని చంపేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. అందుకే పూర్తిగా బయట ఆహారం మానేయాల్సిందే. లేదంటే మీరు చాలా వ్యాధుల బారిన పడతారు.

ఈ కాలం యువతకు బయట ఫుడ్ అంటే ఫ్యాషన్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అయితే తల్లి వంట వండినా సరే బయట తినాలి అని కోరుకుంటున్నారు. పక్కింటి పుల్ల కూర రుచి అన్నట్టుగా ఆరోగ్యకరమైన ఆహారం ఉన్నా సరే అనారోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు నేటి యువత. దీని వల్ల మరింత సమస్యలు వస్తాయి. వయసులో ఉన్న వారు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తింటే వారి ఆరోగ్యం అంత బాగుంటుంది. లేదంటే మీరు సమస్యలను కావాలని తెచ్చిపెట్టుకున్న వారు అవుతారు తస్మాత్ జాగ్రత్త.