Lokesh Kanagaraj Next Film: సౌత్ ఇండియా లో రాజమౌళి(SS Rajamouli) తర్వాత మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) ఉంటాడు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో కూలీ చిత్రం ఒక్కటే కమర్షియల్ గా యావరేజ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లాప్/ డిజాస్టర్ కూడా అయ్యింది. లోకేష్ కనకరాజ్ కెరీర్ లో బలహీనమైన వర్క్ ఏది అంటే, కచ్చితంగా అందరూ కూలీ చిత్రం పేరే చెప్తారు. అయితే ఈ సినిమా తర్వాత లోకేష్ ఏ చిత్రం చేయబోతున్నాడు?, ఇంతకు ముందు ఆయన చెప్పినట్టుగా ‘ఖైదీ 2’ చేస్తున్నాడా?, లేదంటే వేరే ప్రాజెక్ట్ చేస్తున్నాడా అనే విషయం పై సందేహాలు ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం తెలుగు లో చేయబోతున్నాడు. ఇది అయితే దాదాపుగా ఖరారు అయ్యినట్టే.
ఈ ప్రాజెక్ట్ ని KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతోంది. గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్ట్ ని పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నారని, లోకేష్ కనకరాజ్ రీసెంట్ గానే ఆయనకు కథ ని వినిపించాడని, పవన్ కళ్యాణ్ కి అది నచ్చి, వెంటనే డేట్స్ కూడా ఇచ్చేసాడని ఒక టాక్ వైల్డ్ ఫైర్ లాగా సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది. తమిళ న్యూస్ చానెల్స్ కూడా ఈ విషయాన్ని ఖరారు చేశాయి. కానీ నిన్న రాత్రి నుండి, లోకేష్ కనకరాజ్ పవన్ కళ్యాణ్ కి స్టోరీ వినిపించాడు అనే వార్తలో ఎలాంటి నిజం లేదని, లోకేష్ అల్లు అర్జున్ కి ఆ కథని వినిపించాడని, అనిరుద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడని, కేవలం అల్లు అర్జున్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేదే పెండింగ్ లో ఉందని మరో వార్త సోషల్ మీడియా లో షికారు చేసింది.
ఈ వార్తని కూడా కొన్ని అధికారిక తమిళ మీడియా చానెల్స్ ఖరారు చేశాయి. దీతో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం మాతో అంటే మాతో అంటూ సోషల్ మీడియా లో కొట్లాడుకుంటున్నారు. కానీ లోకేష్ నుండి కానీ, KVN ప్రొడక్షన్ హౌస్ నుండి కానీ, ఎలాంటి స్పష్టత ఇప్పటి వరకు రాలేదు. సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ తోనే లోకేష్ మూవీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయట. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు రూమర్ గానే పరిగణిస్తారు. జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా అధికారిక ప్రకటన చేస్తారట. కేవలం అప్పుడు మాత్రమే తెలుస్తుంది, లోకేష్ తదుపరి చిత్రం పవన్ కళ్యాణ్ తోనా?, లేదా అల్లు అల్లు అర్జున్ తోనా అనేది.