Tollywood: 90వ దశకం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్తతరం స్టార్ట్ అయింది. ఇక అప్పటివరకు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ , శోభన్ బాబు లాంటి హీరో లు స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి యంగ్ హీరోలు తమకంటూ మంచి సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్లను అందుకుంటూ ముందుకు సాగారు.
ఇక అందులో భాగంగానే 1998 వ సంవత్సరంలో నలుగురు కూడా స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న క్రమంలో ఇండస్ట్రీలో దర్శకరత్నగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ దాసరి నారాయణ రావు…ఈయన అప్పట్లో అందరూ హీరోలతో సినిమాలు చేసి చాలా పెద్ద సక్సెస్ లను అందుకున్నారు. ఇక ఈయనకి ఈ నలుగురు హీరోలతో మంచి ర్యాపో ఉండటం తో ఈ నలుగురిని పెట్టి ఒక సినిమా చేసి భారీ హిట్ కొట్టాలని ఒక మంచి కథని కూడా రెడీ చేశాడు. ఇక అందులో భాగంగానే ఈ వాళ్ళకి ఆ స్టోరీ చెప్పాడట. వాళ్లకు కూడా ఆ సినిమా స్టోరీ బాగా నచ్చడం తో ఆ సినిమా చేయడానికి వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. కానీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
దానికి కారణం ఏంటి అంటే దాసరి నారాయణరావు ఈ నలుగురు హీరోలకు ఉన్న అభిమానుల్లో కొందరిని పిలిచి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఈ నలుగురిలో ఏ ఒక్క హీరో క్యారెక్టర్ కొంచెం తగ్గిన కూడా ఎవ్వరు కోరుకునే పరిస్థితిలో లేనట్టుగా అర్థమైంది. ఇక కథ అంటే నలుగురిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం ఒకసారి కొంతమంది క్యారెక్టర్లు తగ్గిపోతాయి కొంతమంది క్యారెక్టర్లు పెరుగుతూ ఉంటాయి.
కానీ ఇలా జరిగితే ఈ నలుగురు హీరోల ఫ్యాన్స్ మధ్య విభేదాలు తలెత్తుతాయనే ఒకే ఒక ఉద్దేశ్యం తో దాసరి నారాయణరావు ఈ సినిమాని ఆపేసినట్టుగా తెలుస్తుంది. ఇలా ఈ నలుగురు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించి ఉంటే ఆ సినిమా ఎంతటి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వీళ్లని ఒకే ఫ్రేమ్ లో చూస్తే మాత్రం వాళ్ల అభిమానులకి కన్నుల పండుగ అనే చెప్పాలి కానీ అది కొంచం లో మిస్ అయింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఈ నలుగురిలో ఏ ఇద్దరు హీరోలు కలిసి కూడా మల్టీ స్టారర్ సినిమా చేయలేదు…