Homeఎంటర్టైన్మెంట్బిగ్ బాస్ లో దారుణం: ప్రియను కొట్టబోయిన లోబో.. ఏం జరిగింది?

బిగ్ బాస్ లో దారుణం: ప్రియను కొట్టబోయిన లోబో.. ఏం జరిగింది?

మొత్తానికి బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో నాలుగోవారం నామినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్ల అసలు రంగు బయటపడేది నామినేషన్‌లోనే. ఈ ప్రక్రియలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఈ తగవులు తారాస్థాయికి చేరుకోవడంతోపాటు వీకెండ్‌లో నాగార్జున వచ్చి సర్ది చెప్తే కానీ ఆ కొట్లాటలకు కళ్లెం పడదు.
Lobo Fire On Priya

బిగ్ బాస్ లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. ఏ చిన్న తప్పు చేసినా.. చేయకున్నా సరే కంటెస్టెంట్లు కారణాలు చూపి నామినేట్ చేయాల్సి ఉంటుంది. హౌస్ లోని అందరూ దీన్ని భరించాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు నామినేట్ కావాల్సిందే. ప్రతి సోమవారం దీన్ని చేపడుతారు. అదే రోజు హౌస్ రసాభాసగా సాగుతుంది.

ఇందులో విశ్వ, నటరాజ్‌ మాస్టర్‌ మధ్య మాటల యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది. శ్రీరామచంద్ర.. శ్వేత తనకు వెన్నుపోటు పొడుస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇక లోబో ప్రియను నామినేట్‌ చేస్తూ చెప్పిన కారణం చాలామందికి మింగుడు పడటం లేదు. తొలి ప్రేమ సంగతులు చెప్పమని బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్కులో లోబో తన ఫస్ట్‌ లవ్‌ గురించి చెప్పాడు. అయితే ప్రియ దాన్ని సినిమా స్టోరీలా ఉందని కామెంట్‌ చేయడం అతడికి నచ్చలేదు. ఇదే విషయాన్ని నామినేషన్‌లో ప్రస్తావిస్తూ ఆమెపై ఒంటికాలిపై లేచాడు. తన మీదకు అరవద్దంటూ ప్రియ హెచ్చరిస్తున్నా అతడు మాత్రం నేను ఇలానే అరుస్తానంటూ ఆమె మీదకు వెళ్లాడు. అంతలా చిందులు తొక్కిన లోబో చివర్లో ఏడ్చేయడంతో రవి వచ్చి ఓదార్చాడు. ఇదంతా చూసిన ప్రియ.. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడొద్దు అని చురకలు అంటిస్తూనే ఎమోషనల్‌ అయింది.

అయితే ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. యాంకర్‌ రవి, లోబో కలిసి గేమ్‌ ఆడుతున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఎలిమినేట్‌ అవుతున్న ప్రతి కంటెస్టెంటు సిరి, షణ్ను కలిసి ఆడుతున్నారంటున్నారు గానీ ప్రతిసారి ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూనే మళ్లీ కలిసిపోతున్న యాంకర్‌ రవి, లోబో కలిసి గేమ్‌ ఆడుతున్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవిని ఏమైనా అంటే లోబోకు కోపం వస్తుందని, అందుకే ప్రియను నామినేట్‌ చేశాడని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నేటి నామినేషన్‌లో ఇంకా ఏయే కంటెస్టెంట్ల మధ్య అగ్గి రాజుకుందనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!

4th week nominations..Heated discussion between #Priya and #Lobo .. #BiggBossTelugu5 today at 10 PM

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version