Tollywood: కొత్త కథలతో హిట్లు కొడుతున్న చిన్న హీరోలు…స్టార్ హీరోలు వాళ్లని చూసి చాలా నేర్చుకోవాలి..

ఇండస్ట్రీ లో మంచి సినిమాలను చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపు అయితే వస్తుంది. మిగతా వాళ్ళకి ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ అయితే దక్కదు.

Written By: Gopi, Updated On : October 6, 2024 3:18 pm

Tollywood

Follow us on

Tollywood: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. యంగ్ హీరోలు వరుసగా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిజానికి వాళ్లు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల మీద యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ముఖ్యంగా శ్రీ విష్ణు, అడవి శేషు లాంటి యంగ్ హీరోలు చేసే సినిమాలు సగటు ప్రేక్షకుడిని మెప్పించడంలో ఎప్పుడు సక్సెస్ అవుతూనే వస్తున్నాయి. రీసెంట్ గా శ్రీ విష్ణు చేసిన స్వాగ్ సినిమా చాలా కొత్తగా ఉండడమే కాకుండా డిఫరెంట్ అటెంప్ట్ గా పేరు తెచ్చుకుని ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఇక ఇలాంటి సినిమాలను చేస్తూ ముందుకు సాగితే తప్పకుండా ప్రతి ఒక్కరికి సక్సెస్ లు దక్కుతాయని చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే శ్రీ విష్ణు ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి…

ఇక అడవి శేషు కూడా వరుసగా థ్రిల్లర్స్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయన ‘గూడచారి 2’ సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక మొత్తానికైతే అడవి శేషు తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలందరిలో శ్రీ విష్ణు అడవి శేషు లు మాత్రమే డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి..

ఇక మన ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సైతం ఎప్పుడు మూస ధోరణి కథలను ఎంచుకుంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే విధంగా చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ ఈ యంగ్ హీరోలు మాత్రం అలాంటివేమీ లేకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను మాత్రమే చేస్తూ ముందుకు సాగడం అనేది తెలుగు సినిమా స్టాండర్డ్ ను పెంచుతుంది. ఇక వీళ్లను చూసి మన స్టార్ హీరోలు చాలా వరకు నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉందని మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ సినిమాలకి కలెక్షన్స్ ఎక్కువగా రాకపోయిన, మీడియం రేంజ్ హీరోలు గానే కొనసాగుతున్న వాళ్లు మాత్రం కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ అటెంప్ట్ లతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక సగటు ప్రేక్షకుడికి ఎప్పుడైతే ఒక కథ నచ్చుతుందో ఆ సినిమాను సక్సెస్ చేస్తాడు. అలాగే ఆ ఆర్టిస్టును ఆరాధిస్తూ ప్రేక్షకుడు చివరి వరకు ఆ హీరోతో ముందుకు సాగుతుంటాడు…