Nagarjuna: ఆర్జీవీ కి నాగార్జున లైఫ్ ఇచ్చాడా? నాగార్జున కి ఆర్జీవీ లైఫ్ ఇచ్చాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ల కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక అప్పుడే కొంత మంది దర్శకులు మాత్రం మూస ధోరణిలో వెళ్లకుండా కొత్త కథలతో సినిమాలు చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. అందులో 'రామ్ గోపాల్ వర్మ' ఒకరు...

Written By: Gopi, Updated On : October 6, 2024 3:14 pm

Nagarjuna(12)

Follow us on

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకులలో రామ్ గోపాల్ వర్మ మొదటి స్థానంలో ఉంటాడు. అప్పటివరకు మూస ధోరణిలో సాగుతున్న సినిమా కథలను కొత్త రకంగా చెప్పొచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకుడు వర్మ… శివ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా చరిత్రని మార్చేసిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇక అప్పటివరకు ప్రేక్షకులు చూస్తున్న సినిమా స్టైల్ మొత్తాన్ని మార్చేసి ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ‘శివ ‘ సినిమా రిలీజ్ అయి 35 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విషయాలను సినిమాలో నటించిన నటులు ఆసక్తికరంగా తెలియజేస్తూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే శివ సినిమాతో నాగార్జున, రామ్ గోపాల్ వర్మకి లైఫ్ ఇచ్చాడా? లేదంటే వర్మ నే నాగార్జునకి లైఫ్ ఇచ్చాడా? అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి నాగార్జున లేకపోతే శివ సినిమా అనేది ఉండేది కాదు. రామ్ గోపాల్ వర్మ ను నమ్మి అంత డబ్బులు పెట్టి మొదటి సినిమాకే అంత మంచి అవకాశాన్ని ఇచ్చే హీరోలు ఎవరూ లేరు. నిజానికి నాగార్జున వల్లే ఆర్జీవి వెలుగులోకి వచ్చాడని చెప్పాలి… ఇక ఈ విషయాన్ని వర్మ కూడా చాలా సందర్భాల్లో తెలియజేశాడు. మొత్తానికైతే ఈ ఒక్క సినిమా వల్ల వీళ్ళిద్దరి లైఫ్ సెటిల్ అవ్వడమే కాకుండా ఓవర్ నైట్ లో స్టార్లుగా వెలుగొందారు.

ఇక వర్మ దగ్గర అప్పట్లో శిష్యరికం చేయడానికి చాలామంది ముందుకు రావడానికి కూడా శివ సినిమానే కారణం అని చెప్పాలి. మరి మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్న నాగార్జున… అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగుతూ వస్తున్నాడు.

ఇక ఏది ఏమైనప్పటికీ శివ లాంటి ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఫుల్ సినిమాని తెరకెక్కించినందుకు ఆర్జీవికి కి ప్రశంసలు అయితే దక్కాయి… ఇక ఆయన ఇన్స్పిరేషన్ తో శివ సినిమా చూసి చాలామంది ఇండస్ట్రీకి వచ్చి మేము కూడా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న వారు కూడా చాలామంది ఉండటం విశేషము…

ఇక వర్మ లాంటి చాలామంది దర్శకులు ఈతరం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడానికి చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తున్నారు… ఇక అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన సందీప్ రెడ్డి వంగా సైతం ఆర్జీవి అభిమాని అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…