Bharateeyudu 3: శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సిక్వేల్ గా ‘భారతీయుడు 2’ సినిమా వచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవడమే కాకుండా ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాలను మిగిల్చిందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా వల్లనే లైకా సినిమా ప్రొడ్యూసర్స్ భారీగా నష్టపోయారు. మరి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు భారతీయుడు 3 సినిమాని తెరకెక్కించడానికి శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే భారతీయుడు 2 సినిమా సమయంలో శంకర్ కి, కమలహాసన్ కి మధ్య చాలా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దానివల్లనే ఆ సినిమా అనేది సరిగ్గా తిరకెక్కలేదని శంకర్ భావిస్తున్నారు. ఇక అందులో భాగం గానే భారతీయుడు 3 సినిమాని పర్ఫెక్ట్ గా తెరకెక్కించాలంటే కమల్ హాసన్ తనకు సలహాలు, సూచనలు ఏమీ ఇవ్వకుండా ఓపెన్ మైండ్ తో వచ్చి నటిస్తేనే తప్ప తను ఆ సినిమా చేయలేనని శంకర్ ప్రొడ్యూసర్స్ తో తెగేసి చెప్పేసినట్టుగా తెలుస్తుంది.
‘భారతీయుడు 3’ సినిమాని డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ భావిస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాని తొందరగా ఫినిష్ చేసి ఓటిటీ ప్లాట్ ఫామ్ వేదికకు తీసుకురావాలని శంకర్ కూడా భావిస్తున్నాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ లైకా సినిమా ప్రొడ్యూసర్స్ తో మంతనాలు జరుపుతున్నాడు.
మరి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత భారతీయుడు 3 సినిమాని మొత్తం పూర్తి చేసి దాన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి తీసుకురావాలనే ప్రయత్నంలో శంకర్ భావిస్తున్నాడు. మరి కమల్ హాసన్ కూడా ప్రొడ్యూసర్స్ కు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటే ‘భారతీయుడు 3’ సినిమాలో నటించాల్సిందే అనే కండిషన్ ను తన ముందు ఉంచడంతో తప్పేది లేక కమల్ హాసన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక మొత్తానికైతే ‘భారతీయుడు 2’ సినిమా భారీ డిజాస్టర్ ని మిగల్చడంతో అటు శంకర్, ఇటు కమల్ హాసన్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. మరి ఈ క్రమంలో భారతీయుడు 3 సినిమాతో భారీ సక్సెస్ ని కనుక సాధిస్తే మళ్లీ వాళ్లకు పూర్వ వైభవం వస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…