https://oktelugu.com/

Game Changer : అక్షరాలా 100 కోట్ల రూపాయిల ఫేక్..వివాదాలకు దారితీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్!

తమ సినిమాని జనాలకు దగ్గర చేసేందుకు నిర్మాతలు కాస్త అత్యుత్సాహాన్ని చూపిస్తూ పోస్టర్స్ లో వచ్చిన దానికంటే ఎక్కువ వసూళ్లను వేసి చూపిస్తూ ఉంటారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 11, 2025 / 11:16 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : తమ సినిమాని జనాలకు దగ్గర చేసేందుకు నిర్మాతలు కాస్త అత్యుత్సాహాన్ని చూపిస్తూ పోస్టర్స్ లో వచ్చిన దానికంటే ఎక్కువ వసూళ్లను వేసి చూపిస్తూ ఉంటారు. ఒక్క పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలకు తప్ప, దాదాపుగా అందరి స్టార్ హీరోల సినిమాలకు ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ నిన్న విడుదలైన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మాత్రం నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ వేయడం లో హద్దులు దాటేసారు. మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా 186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఒక పోస్టర్ ని వదిలారు. ఇది అభిమానులు సైతం నవ్వుకునే రేంజ్ లో ఉంది. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 86 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అనుకుంటే, కేవలం 86 కోట్ల దగ్గరే ఆగింది. ఇది రామ్ చరణ్ అభిమానులను చాలా నిరుత్సాహానికి గురి చేసింది.

    కానీ వాళ్ళను ఉత్సాహ పరుస్తూ మూవీ టీం విడుదల చేసిన ఈ పోస్టర్ మాత్రం పెద్ద షాక్ అనే చెప్పాలి. దీనిపై ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రానికి 131 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఒరిజినల్ గా ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. కానీ దీనికి మూవీ టీం మరో 41 కోట్ల రూపాయిలు అదనంగా వేస్తూ 172 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చూపించారు. అప్పట్లో ఇది పెద్ద కాంట్రవర్సి అయ్యింది. ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. కానీ ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ చిత్రంకి ఏకంగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు చూపించడం చర్చనీయాంశం అయ్యింది. ‘రంగస్థలం’ చిత్రం సమయంలో తన సినిమాల మీద కలెక్షన్స్ వేయకండి అంటూ నిర్మాతలకు చెప్పిన రామ్ చరణ్ సినిమానేనా ఇది అంటూ ట్రేడ్ పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఒకరిని చూసి ఒకరు ఇలా ఇష్టమొచ్చిన లెక్కలు పోస్టర్స్ మీద వేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో జనాలు అసలు ఇలాంటి వాటిని పట్టించుకోరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియా లో అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ కూడా ఆగవు. ఈమధ్య ఫ్యాన్ వార్స్ ఎక్కడ దాకా వెళ్లిందంటే, బయటకి వెళ్లి కొట్టుకునేంత రేంజ్ కి వెళ్ళింది. ఇది కచ్చితంగా మంచి సంస్కృతి కాదు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ వచ్చిన కలెక్షన్స్ కి పైసా ఫేక్ లేకుండా పోస్టర్స్ మీద వేసుకుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే ఇలాంటి ఫేక్ పోస్టర్స్ ని మనం ఇప్పటి వరకు ఎప్పుడూ చూసుండము. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సమయంలో పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేశారు, అది కూడా వచ్చిన కలెక్షన్స్ వేశారు కానీ, ఇలా హద్దులు దాటలేదు.