Sankranti Ayamanam : విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాకి ఈ రేంజ్ లో తరలి వెళ్లడం గడిచిన రెండేళ్లలో ఏ సినిమాకి జరగలేదు. వాళ్ళు థియేటర్స్ కదిలితే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో చెప్పడానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఒక ఉదాహరణ అని అంటున్నారు. ఈ చిత్రం తో వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మరోసారి నేటి తరం ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కొక్క సెంటర్ లో వస్తున్న గ్రాస్ వసూళ్లను చూస్తుంటే, ఈ వసూళ్లను నేటి తరం స్టార్ హీరోలు కూడా అంత తేలికగా అందుకోలేరేమో అని అనిపిస్తుంది. వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వీకెండ్ లో మళ్ళీ ఊర మాస్ బ్యాటింగ్ మొదలెట్టింది.
నిన్న ఒక్కరోజే ఈ చిత్రానికి ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయట. అంతే కాకుండా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి శనివారం రోజు 60 వేల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. గంటకు రెండు నుండి మూడు వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. నేడు అయితే ఈ సినిమాకి బుక్ మై షో యాప్ లో గంటకు 5 వేల టిక్కెట్లు సేల్ అవుతున్నాయి. ‘పుష్ప 2 ‘ చిత్రాన్ని ఆడియన్స్ ఒక రేంజ్ లో చూసిన తర్వాత, మరుసటి నెలలో వచ్చిన సినిమాని కూడా అదే రేంజ్ లో చూడడం సాధారణమైన విషయం కాదు. ఆ ఘనత విక్టరీ వెంకటేష్ కి మాత్రమే దక్కుతుంది. ఆయన స్టార్ హీరో గా ఉన్న రోజుల్లో, ఆయన సూపర్ హిట్ సినిమాలకు నెలల తరబడి థియేట్రికల్ రన్ ఉండేదట.
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కూడా నెల రోజులకు పైగా సాలిడ్ షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శివరాత్రి, అనగా ఫిబ్రవరి 26 వ తేదీ వరకు ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నిన్నటితో 132 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది. ఫుల్ రన్ లో కచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుండే 150 కోట్ల రూపాయిలు వస్తాయని అంటున్నారు. సాధారణంగా ఈ సినిమాని ఓటీటీ లోకి నాలుగు వారాల తర్వాత విడుదల చేయాలి. కానీ బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ ఉండడంతో ఓటీటీ విడుదల తేదీని వాయిదా వేశారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈరోజుతో ఈ సినిమా 300 కోట్ల రూపాయిల మైల్ స్టోన్ ని కూడా అందుకోబోతుందని అంటున్నారు.