Remake Movies: ఆ సినిమాలు టాలీవుడ్ లో సూపర్ హిట్ లు కానీ కోలీవుడ్ లో డిజాస్టర్స్

జూనియర్ ఎన్టీఆర్ ని స్టార్ గా నిలబెట్టిన సినిమా సింహాద్రి. అలానే రాజమౌళి కెరియర్ ని కూడా మార్చేసింది ఈ సినిమా. కానీ ఇదే సినిమాని విజయ్ కాంత్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తే మాత్రం అక్కడ డిజాస్టర్ అయ్యింది.

Written By: Swathi Chilukuri, Updated On : July 31, 2023 11:02 am

Remake Movies

Follow us on

Remake Movies: ప్రాంతాన్ని బట్టి ప్రజల అభిప్రాయం, పద్ధతులు, మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. ప్యాన్ ఇండియా కంటెంట్ ఉండే సినిమాలు పక్కన పెడితే, మామూలు సినిమాలు అన్ని వారి ప్రాంతం వారికి నచ్చేటట్టు తీర్చిదిద్దుతూ ఉంటారు దర్శకుడు. అందుకే సినిమాలు ఒకే కథతో వచ్చిన, ఒక భాషలో సూపర్ హిట్ అయ్యి, మరో భాషలో ఫ్లాప్ అయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ భాషలు ఆడియన్స్ భిన్నాభిప్రాయాలు, డిఫరెంట్ నేటివిటీ వల్ల ఇలా ఎక్కువగా జరిగే అవకాశాలు లేకపోలేదు. మరి అలా మన తెలుగులో సూపర్ హిట్ అయి తమిళంలో రీమేక్ చేసినప్పుడు మాత్రం పరాజయం పాలైన సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం..

సింహాద్రి

జూనియర్ ఎన్టీఆర్ ని స్టార్ గా నిలబెట్టిన సినిమా సింహాద్రి. అలానే రాజమౌళి కెరియర్ ని కూడా మార్చేసింది ఈ సినిమా. కానీ ఇదే సినిమాని విజయ్ కాంత్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తే మాత్రం అక్కడ డిజాస్టర్ అయ్యింది.

అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రిలీజ్ ముందు రోజు పైరసీ ప్రింట్ రిలీజ్ అయినా కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఇక ఇదే సినిమాని తమిళంలో రాజవతాన్ వరువాన్ పేరుతో శింబు హీరోగా రీమేక్ చెయ్యగా అక్కడ పెద్ద డిజాస్టర్ అయ్యింది.

కిక్

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ
జయం రవి హీరోగా తిల్లాలంగిడి పేరుతో తమిళంలో లో రీమేక్ అయినప్పుడు మాత్రం అక్కడ ఫ్లాప్ అయ్యింది.

జులాయి

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం జులాయి. ఈ చిత్రం టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలవగా తమిళంలో మాత్రం సాహసం పేరుతో ప్రశాంత్ హీరోగా రీమేక్ అయ్యి పరాజయం పాలైంది.

100% లవ్

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ నాగచైతన్య కెరీర్ లో నే బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమా గా నిలిచింది. ఇక ఇదే చిత్రాన్ని 100% కాదల్ పేరుతో జీవి ప్రకాష్ హీరోగా చెయ్యగా, అక్కడ ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

ఆర్య

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన ఆర్య సినిమా తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేయగా తమిళంలో ధనుష్ హీరోగా రీమేక్ చేస్తే మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.