Margadarsi Case: మార్గదర్శి కేసులో వైసీపీ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. రాజగురువు రామోజీరావును కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఫిర్యాదుదారుడే లేని ఈ కేసును లోతుగా తీసుకెళ్లగలిగింది. ఒకవైపు కోర్టులో విచారణ.. మరోవైపు సిఐడి దూకుడు కొనసాగుతోంది. తాజాగా మార్గదర్శి ఖాతాదారులకు నోటీసులు పేరిట పత్రికల్లో భారీ ప్రకటనలు వచ్చాయి. రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అయితే మార్గదర్శి యాజమాన్యం ధైర్యం వెనుక మరో లెక్క ఉంది. ఆ నోటీసులను కోర్టు తప్పుపడుతుందన్న నమ్మకం ఉంది. కానీ ఇవేవీ పట్టించుకోని జగన్ సర్కార్ మార్గదర్శిని దారుణంగా దెబ్బతీయాలని ప్లాన్ చేశారు. అందులో కొంత సక్సెస్ అయ్యారు.
మార్గదర్శి కేసు ఇప్పటిది కాదు. అప్పుడెప్పుడో వైఎస్సార్ ప్రభుత్వ హయాం నుంచి రచ్చ కొనసాగుతోంది. కానీ మార్గదర్శిని ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. జగన్కు అసహనంగా మారుతోంది. అందుకే మార్గదర్శి ఖాతాదారులను కెలకాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఈ కేసు విషయంలో ఇంత పెద్ద స్థాయిలో వ్యవహారం నడుస్తున్నా ఖాతాదారులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. మార్గదర్శిలో చిట్ పండ్లు కడుతూనే ఉన్నారు. ఏపీలోని 37 బ్రాంచుల్లో లావాదేవీలు యధావిధిగాని కొనసాగుతున్నాయి. అందుకే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జగన్ సర్కార్ భారీ ప్రకటనల రూపంలో యాడ్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలకు దిగినా మార్గదర్శి యాజమాన్యం పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ అంశంపై కోర్టు ఏ విషయము స్పష్టత తెలియజేయడం లేదు. అప్పటివరకు మార్గదర్శిని ఇరుక్కుని పెట్టేందుకు ఖాతాదారులు కు నోటీసులంటూ ప్రభుత్వం భారీ మొత్తంతో ప్రకటనలు ఇవ్వడం విస్మయపరుస్తోంది. అయితే మార్గదర్శి ధైర్యం మాత్రం ముమ్మాటికీ న్యాయస్థానమే.
రామోజీరావు సైతం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. జగన్ సర్కారు చర్యలను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఈనాడులో పతాక శీర్షిక ప్రభుత్వ వ్యతిరేక కథనాలను ప్రచురిస్తున్నారు. ప్రజల్లోకి ఇవి బలంగా వెళుతున్నాయి. దీంతో జగన్ రామోజీరావు పై రివెంజ్ కు డిసైడ్ అయ్యారు. ఈ తరుణంలో ఖాతాదారుల వైపు నుంచి మార్గదర్శిని తవ్వుకు రావాలని చూస్తున్నారు. అందుకే కోట్లాది రూపాయల ధనాన్ని ఖర్చు చేసి మరి మార్గదర్శిని పలుచన చేయాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి.