https://oktelugu.com/

Leo Movie Craze: అభిమాన హీరో సినిమా కోసం థియేటర్లోనే అంత పనిచేశాడు.. వైరల్ వీడియో

దళపతి విజయ్‌ సినిమా ‘లియో’ అక్టోబర్‌ 19 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఫ్యాన్స్‌ రచ్చ మొదలుపెట్టారు. సినిమా హాళ్ల ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 21, 2023 / 01:02 PM IST

    Leo Movie Craze

    Follow us on

    Leo Movie Craze: సినిమా హీరో హీరోయిన్లకు ఫ్యాన్స్‌ ఉండడం సహజం. కొంత మంది ఫ్యాన్స్‌కు అభిమాన నటులను విపరీతంగా ఆరాధిస్తారు. అభిమాన నటుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇక తమ అభిమాన హీరో సినిమా విడుదల అంటే ఫ్యాన్స్‌ సంబరం మామూలుగా ఉండదు. డ్యాన్సులు, ఈలలు గోల గోల చేస్తారు. బాణా సంచా కాలుస్తారు. అయితే ఓ జంట వీటన్నింటికీ అతీతంగా ఓ పని చేసింది. అభిమాన హీరో సినిమా చూసేందుకు ఏకంగా థియేటర్‌నే బుక్‌ చేసుకుంది.

    లియో సినిమా థియేటర్‌లో పెళ్లి..
    దళపతి విజయ్‌ సినిమా ‘లియో’ అక్టోబర్‌ 19 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఫ్యాన్స్‌ రచ్చ మొదలుపెట్టారు. సినిమా హాళ్ల ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఇదంతా ఒక ఎత్తయితే బెనిఫిట్‌ షో చూడటానికి వచ్చిన ఓ జంట అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చెన్నైకి చెందిన వెంకటేష్, మంజుల థియేటర్లో దండలు వేసుకుని, ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

    ఇద్దరికీ అభిమాన హీరో
    చెన్నైకి చెందిన వెంకటేష్, మంజుల ఇద్దరూ హీరో విజయ్‌కి వీరాభిమానులట. ఈ ఏడాది స్టార్టింగ్‌లో వీరికి ఎంగేజ్మెంట్‌ అయ్యింది. అక్టోబర్‌ 20 న వీరి వివాహం నిశ్చయమైంది. 19న తమ అభిమాన హీరో విజయ్‌ లియో రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో సాంప్రదాయ దుస్తుల్లో థియేటర్‌ కి వెళ్లారు. వీరితో స్నేహితులు, బంధువులు కూడా వచ్చారు. సినిమా ప్రారంభానికి ముందే దండలు వేసుకుని, ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తరువాత సినిమా వీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. వీరి పిచ్చి పీక్స్‌లో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విజయ్‌–లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో వచ్చిన లియో హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది.