Lenin Movie: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నాగేశ్వర రావు దగ్గర నుంచి అఖిల్ వరకు ప్రతి ఒక్కరు విభిన్నతరహాలో సినిమాలను చేసిన వారే కావడం విశేషం… అఖిల్ కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికి 10 ఏళ్ళు దాటిన సరైన సక్సెస్ అయితే రావడం లేదు. దాంతో ఆయన ఫేడౌట్ అయిపోయే దశకు దగ్గరలో ఉన్నాడు అంటూ చాలామంది కామెంట్లు చేశారు. ఎట్టకేలకు లెనిన్ సినిమాతో సక్సెస్ ని సాధించి అందరి నోళ్లు మూయించాడు. మాస్ హీరోగా అవతరించాడమే కాకుండా ప్రేక్షకుఅందరితో కూడా శభాష్ అనిపించుకునేలా నటించి మెప్పించాడు. ప్రస్తుతం లెనిన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుంది…
ఈ సినిమా మొదట నాగ వంశీ ప్రొడ్యూసర్ గా స్టార్ట్ అయినప్పటికి మధ్యలో ఈ సినిమా కొద్దిరోజుల పాటు షూటింగ్ ను ఆపేశారు. కారణం ఏంటి అంటే అనుకున్న బడ్జెట్ కంటే సినిమా బడ్జెట్ ఎక్కువ అయిపోతుండడంతో సినిమాని కొద్ది రోజులపాటు నిలిపేశారు. దాంతో నాగార్జున కథ బాగుంది.
అఖిల్ కి మంచి విజయం దక్కుతుందని తెలుసుకొని తను ప్రొడక్షన్ వైపు ఎంటరయ్యాడు. దాంతో నాగ వంశీ నాగార్జున ఇద్దరూ కూడా ఈ సినిమాని ఫినిష్ చేశారు. మొత్తానికైతే ఈ సినిమాతో అఖిల్ కి మంచి విజయం దక్కింది. నాగ వంశీ ఖాతాలో సైతం మరొక సక్సెస్ రావడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అంతకుముందు నాగ వంశీ వరుసగా ఫ్లాప్ సినిమాలు చేశాడు.
రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్న నాగవంశీ మరిన్ని కొత్త సినిమాలకు కూడా లైన్ క్లియర్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు…ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…
