KS Nageswararao: టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా మరణించారు. శుక్రవారం సొంతూరు నుండి హైదరాబాద్ తిరిగొస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో సడన్‌గా ఫిట్స్ రావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా.. మరణించినట్లు వైద్యులు నిర్ధరించారని ఆయన కుమారుడు తెలిపారు. నాగేశ్వరరావుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ వార్త విన్న ప్రముఖ సినీ సెలబ్రిటీలు ఆయనకు సంతాపం తెలిపారు.
ఫిట్స్ వచ్చిన సమయంలో స్థానికులు వెంటనే స్పందించి.. నాగేశ్వరరావును ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పక్కనే రెండు, మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లగా.. వాళ్లు ఇంకో ఆసుపత్రికి వెళ్లమనడం.. అలా.. ఏలూరు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించడం జరిగినట్లు సమాచారం. కానీ, సమయానికి వైద్యం అందకపోవడంతో.. ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని ఆయన అత్తగారిల్లు కవులూరులో ఉంచారు. అక్కడే అత్యక్రియలు కూడా నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తెలిపారు.
Also Read: Kamal Haasan: కమల్‌హాసన్ విషయంలో శ్రుతి కీలక నిర్ణయం
చిత్ర పరిశ్రమలో 1986 నుంచి ఉన్న ఆయన.. స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణకు అసిస్టెంట్‌గా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు. రిక్షా రుద్రయ్యా సినిమాతో దర్శకుడిగా మారి.. శ్రీహరిని పరిచయం చేస్తూ.. పోలీస్ సినిమా తీశారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో వరుసగా శ్రీశైలం, సాంబయ్య, దేశద్రోహి వంటి సినిమాలు తీశాడు. కాగా, ఇటీవలే వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను మొదలుపెట్టారు. కానీ, ఆ సినిమా పూర్తి కాకముందే ఆయన మరణించడం బాధాకరం.
Also Read: HariHara Veeramallu: ఫైనల్‌గా తిరిగి పట్టాలెక్కనున్న వీరమల్లు.. షెడ్యూల్ ఎప్పుడంటే?