https://oktelugu.com/

Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల…

Kamal Haasan: ప్రముఖ నటుడు కమల్ హాసన్ కమల్ హాసన్ కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్‏కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా… పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అక్కడ ఆయన వైరస్ బారిన పడ్డాడని అంటున్నారు. ప్రస్తుతం కమల్ వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటూ క్వారంటైన్‏లో ఉన్నట్లుగా ఆయన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 09:49 AM IST
    Follow us on

    Kamal Haasan: ప్రముఖ నటుడు కమల్ హాసన్ కమల్ హాసన్ కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్‏కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా… పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అక్కడ ఆయన వైరస్ బారిన పడ్డాడని అంటున్నారు. ప్రస్తుతం కమల్ వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటూ క్వారంటైన్‏లో ఉన్నట్లుగా ఆయన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం కమల్ చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌ లో చికిత్స తీసుకుంటున్నారు.

    Kamal Haasan

    Also Read: HariHara Veeramallu: ఫైనల్​గా తిరిగి పట్టాలెక్కనున్న వీరమల్లు.. షెడ్యూల్​ ఎప్పుడంటే?

    కాగా తాజాగా కమల్ ఆరోగ్యంపై శ్రీ రామ చంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రి అధికారులు బులెటిన్‌ను విడుదల చేశారు. ఆ బులెటిన్ లో “కమల్ హాసన్ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో చేరారు. ఆయన బాగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా కొనసాగుతోంది” అని బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ వర్తతో ఆయన్ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న అభిమానులు, సినీ ప్రముఖులకు కొంత ఊరట లభించింది. మరో వైపు ఆయన ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. మరోవైపు ఆయనను దగ్గరుండి చూసుకోవడానికి కమల్ తనయ శృతి హాసన్ షూటింగ్ పనులు ముగించుకుని చెన్నైకి చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ విక్రమ్, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తూ… తమిళ్ బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

    Also Read: Akhanda Movie: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి…