https://oktelugu.com/

Ram Charan: సరికొత్త పంథాలో చెర్రి.. రోజుకో కొత్త లుక్​లో దర్శనం

Ram Charan: మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ ఇటీవల కాలంలో ఫ్యాషన్​వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. గతకొద్దికాలంగా ఆయన ఎప్పుడు బయట కనిపించినా.. సరికొత్త లుక్​లో స్టైలిష్ మేక్​ఓవర్​తో కనిపిస్తూ.. హాట్​టాపిక్​గా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో సరికొత్త లుక్​లో దర్శనమిచ్చారు. సౌత్​ స్టార్​ ఇండో వెస్ట్రన్​ లుక్​లో కనిపిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరిచారు చెర్రి. ఆలివ్​ గ్రీన్​ కుర్తాతో నల్ల ప్యాంటు ధరించి దేశీ, వెస్ట్రన్​ లుక్​లను మిక్స్ చేసి డిఫరెంట్​గా కనిపించారు. ఈ క్రమంలోనే పక్కనే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 09:25 AM IST
    Follow us on

    Ram Charan: మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ ఇటీవల కాలంలో ఫ్యాషన్​వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. గతకొద్దికాలంగా ఆయన ఎప్పుడు బయట కనిపించినా.. సరికొత్త లుక్​లో స్టైలిష్ మేక్​ఓవర్​తో కనిపిస్తూ.. హాట్​టాపిక్​గా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో సరికొత్త లుక్​లో దర్శనమిచ్చారు.

    Ram Charan New Look

    సౌత్​ స్టార్​ ఇండో వెస్ట్రన్​ లుక్​లో కనిపిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరిచారు చెర్రి. ఆలివ్​ గ్రీన్​ కుర్తాతో నల్ల ప్యాంటు ధరించి దేశీ, వెస్ట్రన్​ లుక్​లను మిక్స్ చేసి డిఫరెంట్​గా కనిపించారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న  ఫొటోగ్రాఫర్లకు చిరునవ్వుతో ఫోజులిచ్చి అక్కడనుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారిపోయాయి.

    Also Read: HariHara Veeramallu: ఫైనల్​గా తిరిగి పట్టాలెక్కనున్న వీరమల్లు.. షెడ్యూల్​ ఎప్పుడంటే?

    ప్రస్తుతం రామ్​చరణ్ శంకర్​ దర్శత్వంలో రూపొందుతోన్న సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్​ మొదలుపెట్టిన ఈ సినిమా దాన్ని పూర్తి చేసుకుని..  ప్రస్తుతం రెండో షెడ్యూల్​లో అడుగుపెట్టింది. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. కాగా, ఈ సినిమాలో కియారా అద్వాని, జయరామ్ అంజలి, సునీల్​, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    మరోవైపు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రానున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో రామ్​చరణ్​తో పాటు తారక్​ కూడా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలియా భట్​, అజయ్ దేవగన్​, శ్రియ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

    Also Read: Kamal Haasan: కమల్​హాసన్​ విషయంలో శ్రుతి కీలక నిర్ణయం