Leela Vinodham Review : సోషల్ మీడియా లో యూట్యూబర్ గా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మన తెలుగు ఆడియన్స్ మరింత చేరువైన సంగతి అందరికి తెలిసిందే. ఈమధ్య ఎక్కువ కాంట్రవర్సిలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన షణ్ముఖ్ , కాస్త గ్యాప్ తీసుకొని ‘లీలా వినోదం’ అనే వెబ్ ఫిలిం ద్వారా మన ముందుకు వచ్చాడు. ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాము.
కథ :
ఆంధ్ర ప్రదేశ్ లోని తణుకు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రసాద్ (షణ్ముఖ్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన సాధారమైన కుర్రాడు. ఇతనికి రాజీవ్, అశోక్, సాగర్ అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. ప్రసాద్ కి పోలీస్ ఆఫీస్ అవ్వాలనే కోరిక ఉంటుంది. ఆ లక్ష్యానికి తగ్గట్టుగానే అతను చదువుకుంటాడు. అయితే డిగ్రీ కాలేజ్ లో చేరినప్పుడు ఆయన దృష్టిలో లీల ( అనఘ అజిత్) పడుతుంది.తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడుతాడు ప్రసాద్. కానీ ఆ విషయాన్నీ ఆమెకి చెప్పడు. తన ప్రేమ సంగతి లీలకి చెప్పమని ప్రసాద్ స్నేహితులు ఒత్తిడి చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు ధైర్యం చేసి లీల మొబైల్ నెంబర్ కి ‘ఐ లవ్ యూ’ అని మెసేజ్ చేస్తాడు ప్రసాద్.
కానీ ఆ అమ్మాయి నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాదు. దీంతో కంగారు పడిన ప్రసాద్, తాను మెసేజ్ చేసిన విషయం లీల ఇంట్లో తెలిసిపోయిందేమో అని, వాళ్ళింట్లో పెద్ద గొడవ జరిగిందేమో, తన వల్ల సమస్యలు ఏర్పడ్డాయి అని ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇంతకు అసలు ఏమైంది?, ఆ అమ్మాయి నుండి ఎందుకు రెస్పాన్స్ రాలేదు. ప్రతీ విషయానికి కంగారు పడే ప్రసాద్, ఈ విషయం లో ఏమి చేసాడు. దాని వల్ల అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
ఈ కథ కేవలం హీరో షణ్ముఖ్, మరియు అతని ముగ్గురు స్నేహితుల మధ్య మాత్రమే తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ పేరు ని సినిమా టైటిల్ లో పెట్టారు కానీ, ఆమె కేవలం సినిమాలో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే ని ఆసక్తికరంగా పరుగులు తీయించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ కి ఐ లవ్ యూ మెసేజ్ పెట్టిన తర్వాత ఆమె నుండి రెస్పాన్స్ రాకపోవడానికి గల కారణం ఏమిటని హీరో ఎలా అయితే తెలుసుకోవాలని అనుకుంటాడో , ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులు కూడా అలాగే అనుకుంటారు. ఆ ఆత్రుతని ఆడియన్స్ లో క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్ కూడా చాలా కొత్తరకంగా డిజైన్ చేసారు.
ప్లస్సులు :
–> షణ్ముఖ్ జస్వంత్ నటన
–> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
–> స్క్రీన్ ప్లే
మైనస్సులు:
–> బలహీనమైన స్టోరీ
–> డైలాగ్స్ పేలకపోవడం
చివరి మాట : డైరెక్టర్ పవన్ సుంకర కొత్త వాడు కావడంతో ఈ సినిమాని కూడా కొత్త స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేసాడు. ఒక కొత్త తరహా లవ్ స్టోరీ ని చూసిన అనుభూతి కలిగింది. నిజంగా ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించిన అబ్బాయిలకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. వీకెండ్ లో టైం పాస్ అయ్యే చిత్రం, చూసి ఎంజాయ్ చేయండి.
రేటింగ్ : 2.75/5