Viral video : అమృతం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ సీరియల్ చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా ఈ సీరియల్‌ను ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా 90s కిడ్స్ అయితే దీన్ని రోజూ గుర్తుపెట్టుకుంటారు. ఇలా అప్పటి సీరియల్స్‌లో కొందరు నటులు చిన్నతనంలో ఏదో ఒక సందర్భాల్లో కనిపించి ఉంటారు. అప్పటి ఫొటోలను, ఇప్పటి మనుషులను చూస్తే ఇంత తక్కువ సమయంలో ఇలా మారిపోయారా? అనిపిస్తుంటుంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఇద్దరు కుమారులు కూడా సినీ రంగాన్నే ఎంచుకున్నారు. పెద్ద కొడుకు కాళ భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తుండగా చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గుణ్ణం గంగరాజు తీసిన అమృతం సీరియల్ అప్పట్లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టింది. చాలా మందికి అమృతం సీరియల్ ఒక ఎమోషన్. అలాంటి సీరియల్‌లో కీరవాణి ఇద్దరు కొడుకులు కూడా నటించారు. ఓ ఎపిసోడ్‌లో ఇద్దరూ కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అందరి ఫేవరేట్ అయిన అమృతం సీరియల్‌లో 12వ ఎపిసోడ్‌లో చిన్న పిల్లలది ఒకటి వచ్చింది. అందులో కాళ భైరవ, శ్రీ సింహా ఇద్దరూ కూడా కనిపించారు. దీంతో అప్పట్లో వీరిద్దరూ ఎంత చిన్న పిల్లలుగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. అప్పట్లో ఎంత క్యూట్‌గా పిల్లలు ఉన్నారో.. ఇప్పుడు ఎంత పెద్ద వాళ్లు అయిపోయారని అంటున్నారు. కాళ భైరవ, శ్రీ సింహా చిన్నప్పుడు ఎలా ఉన్నారో సేమ్ టూ సేమ్ పెద్ద అయిన తర్వాత కూడా అలానే ఉన్నారని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కాళ భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. శ్రీ సింహా హీరోగా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టింది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాతో శ్రీ సింహా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమాలో కూడా బాలనటుడిగా కనిపించగా.. ఈగ సినిమాలో సమంతకు ఫ్రెండ్‌గా నటించాడు. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. అయితే మత్తు వదరలా సినిమాతో శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే శ్రీసింహా ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు అయిన రాగ మాగంటిని శ్రీ సింహా వివాహం చేసుకున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. డిసెంబర్ 14న వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. అయితే వీరి వివాహానికి స్నేహితులు, కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
